ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘గేమ్ చేంజర్’ ఒకటి. ఐతే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. ఎట్టకేలకు సినిమా ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఐతే సినిమా మొదలైన దగ్గర్నుంచి ‘గేమ్ చేంజర్’ విషయంలో అభిమానుల కంప్లైంట్స్ ఏంటంటే.. సమయానికి అప్‌డేట్స్ ఏమీ ఇవ్వట్లేదని. ఐతే శంకర్ సినిమా అంటే వ్యవహారం అలాగే ఉంటుంది. మేకింగ్ దశలో విశేషాలేవీ బయటికి రానివ్వరు.
సినిమా అంతా అయ్యాకే ప్రమోషన్ మొదలుపెడతారు. ఐతే సినిమా షూటింగ్‌లోనే చాలా జాప్యం జరగడంతో చరణ్ ఫ్యాన్స్ మరీ ఎక్కువ కాలం వేచి చూడాల్సి వచ్చి అసహనానికి గురవుతున్నారు.
‘గేమ్ చేంజర్’లో ముఖ్య పాత్ర పోషిస్తున్న అంజలి తన కొత్త చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసినపుడు ‘గేమ్ చేంజర్’ గురించి అడిగితే చాలా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నట్లు తెలిపింది.
“గేమ్ చేంజర్ సినిమా గురించి, అందులో నా పాత్ర గురించి చాలా మాట్లాడాలని ఉంది. ఎన్నో విషయాలు నా గొంతు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. ఏం చేద్దాం. ఈ సినిమా గురించి ప్రొడక్షన్ హౌస్ కానీ, దర్శకుడు శంకర్ గారు కానీ ఏమీ మాట్లాడట్లేదు. ఎవరినీ ఏమీ మాట్లాడొద్దంటున్నారు. దీంతో నేను మౌనం వహించాల్సి వస్తోంది. నా నోటికి ప్లాస్టర్ వేసినట్లు అనిపిస్తోంది. కానీ సినిమాలో ఎగ్జైటింగ్ విషయాలు చాలా ఉన్నాయి” అని అంజలి తెలిపింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 26, 2024 4:00 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…