ఐతే శుక్రవారం విడుదలైన రాజు యాదవ్ సినిమాను జనం పట్టించుకోలేదు. కానీ శనివారం మాత్రం థియేటర్లలో సందడి కనిపించింది. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి, బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లవ్ మి సినిమాతో మళ్లీ థియేటర్లలో జనం కనిపించారు.
లవ్ మికి మొన్నటిదాకా పెద్దగా బజ్ లేనట్లే కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా లేవు. దీంతో దిల్ రాజు అండ్ టీం కంగారు పడే ఉంటుంది. కానీ శనివారం మార్నింగ్ షోలకు ఇటు సింగిల్ స్క్రీన్లు, అటు మల్టీప్లెక్సుల్లో బాగానే జనం కనిపించారు. కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. ఎట్టకేలకు జనం మళ్లీ ఓ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపించారు. ఎక్కువగా వాకిన్స్‌తోనే థియేటర్లలో కళ వచ్చింది.
ఐతే లవ్ మి ఈ అవకాశాన్ని ఎంతమేర ఉపయోగించుకుంటుందన్నదే ప్రశ్నార్థకం. ఈ చిత్రానికి ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినప్పటికీ.. గందరగోళంగా సాగిన నరేషన్, అన్ కన్విన్సింగ్ క్యారెక్టర్లు సినిమాకు ప్రతికూలంగా మారాయి. ఇటు రివ్యూలు, అటు మౌత్ టాక్ ఏమంత బాగా లేదు. ఐతే వీకెండ్ వరకు సినిమా ఎలాగోలా నడిస్తే సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశముంటుంది.
This post was last modified on May 25, 2024 9:10 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…