జూనియర్ ఎన్టీఆర్ దేవర మీద ఎలాంటి అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇటీవలే విడుదలైన మొదటి లిరికల్ వీడియో ఫియర్ పట్ల తొలుత మిశ్రమ స్పందన కనిపించినా తర్వాత ఛార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెట్టడం అభిమానులకు కొత్త ఎనర్జీని ఇచ్చింది. క్రికెట్, రాజకీయాల్లో ఇటీవల జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలకు దీన్నే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వాడుకోవడాన్ని బట్టే చెప్పొచ్చు ఎంతగా రీచ్ వచ్చిందో. ఇదిలా ఉండగా కథకు సంబంధించిన క్లూస్ ఎక్కువగా లీకవ్వకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ ఏదో ఒక రూపం కొన్ని బయటికి వచ్చి ఫ్యాన్స్ లో హైప్ ని మరింత పెంచుతున్నాయి.
తాజాగా తెలిసిన అప్డేట్ ప్రకారం దేవరలో తారక్ సముద్రపు ఒడ్డున ఉండే పది ఊళ్ళను కాపు కాసే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తాడట. టీజర్, ఫియర్ సాంగ్ లో చూపించే యాక్షన్ ఎపిసోడ్ అందులో భాగంగానే వస్తుందని తెలిసింది. అక్కడ దొరికే విలువైన సంపద కోసం ముష్కరులు కుట్ర వేసి పది వేల మందితో దాడి చేస్తే వాళ్ళను ఊచకోత కోస్తూ దేవర చూపించే విశ్వరూపం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఎరుపెక్కిన సముద్రమంతా నెత్తురుతో నిండిపోయి ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని రక్తపాతాన్ని దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరిస్తారని అంటున్నారు.
వినడానికే ఇంత ఎగ్జైట్ మెంట్ అనిపిస్తున్న ఈ ఎపిసోడ్ ఇక తెరమీద ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. దేవర రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులుగా జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఇప్పటికే ఉంది. కాకపోతే బాహుబలి తరహాలో ఉంటుందా లేక ఒకేసారి ఇద్దరినీ తెరమీద చూపించేలా కొరటాల స్క్రిప్ట్ రాసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అనిరుద్ రవిచందర్ మీద జనాలకు నమ్మకం వచ్చేసింది. హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇంటర్వ్యూలలో దేవర గురించి నొక్కి చెబుతోంది. అక్టోబర్ 10 విడుదలలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు.
This post was last modified on May 25, 2024 1:17 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…