బాలీవుడ్ బడా స్టార్లలో ఒకడైన సంజయ్ దత్ జీవితం ఎప్పుడూ నిలకడగా, ప్రశాంతంగా సాగింది లేదు. మాఫియాతో లింకులు, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అతను చాలా ఏళ్ల పాటు వేదన అనుభవించాడు. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అంతటితో అతడి జీవితంలో చెడు రోజులు అయిపోయాయని అనుకున్నారు కానీ.. కొన్నేళ్ల విరామం తర్వాత అతడికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
ఇటీవలే సంజుకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని.. అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని ఇటీవలే వెల్లడైంది. దీంతో బాలీవుడ్లో అతడి సన్నిహితులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అతడి కోసం అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ముంబయిలోనే చికిత్స తీసుకున్న సంజయ్ దత్.. చికిత్స కోసమో, మరో దాని కోసమో కానీ.. తాజాగా దుబాయ్‌కి వెళ్లాడు.
అక్కడ తన భార్య మాన్యత, పిల్లలతో కలిసి సంజయ్ దత్ దిగిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో సంజయ్ బాగా వీక్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. మామూలుగా గడ్డంతో కనిపించే సంజు.. క్లీన్ షేవ్ చేసుకోగా.. ముఖం చిన్నదైపోయింది. కళ్లు లోపలికి వెళ్లిపోయాయి. మొత్తంగా సంజు ఏమాత్రం హుషారు లేకుండా శోకంలో ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు.
అనారోగ్యం వల్ల అతడి శరీరం కుంగుబాటుకు లోనైందా.. లేక మానసిక వేదనతో అలా అయ్యాడా అన్నది తెలియదు కానీ.. ఈ లుక్‌లో సంజును చూడగానే అభిమానులకు దు:ఖం పొంగుకొస్తోంది. అతను కోలుకుని మామూలు మనిషి కావాలని వాళ్లు గట్టిగా కోరుకుంటున్నారు. అత్యాధునిక చికిత్స కోసం సంజు త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సంజు నటిస్తున్న, నటించాల్సిన సినిమాలు అరడజనుకు పైగానే ఉన్నాయి. అతను అనారోగ్యం బారిన పడటంతో 700 కోట్ల మేర పెట్టుబడులు రిస్క్‌లో పడ్డాయి.
This post was last modified on September 18, 2020 4:22 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…