టాలీవుడ్లో మంచి పేరు సంపాదించి ఆ తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దర్శకులు చాలామందే ఉన్నారు. ఐతే వాళ్లందరూ తెలుగులో ప్రూవ్ చేసుకున్నాకే బాలీవుడ్లో అవకాశం అందుకున్నారు. కానీ ఇప్పుడో దర్శకుడు సైలెంటుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తన పేరు.. చరణ్ తేజ్ ఉప్పలపాటి. ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించొచ్చు.
నిఖిల్ మూవీ ‘స్పై’కి అతను నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరించాడు. పోస్టర్ మీద ‘సీఈవో’గా పడింది ఈ పేరు. ఇప్పుడీ కుర్రాడు ఓ పెద్ద సినిమాతో బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ చిత్రంలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ కాజోల్ లీడ్ రోల్ చేస్తుండడం విశేషం. ఆమెకు జోడీగా ప్రభుదేవా కూడా నటిస్తున్నాడు.
అంతే కాక ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’ ‘విరూపాక్ష’ లాంటి చిత్రాలతో తెలుగులో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త ఈ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇంకా నసీరుద్దీన్ షా లాంటి లెజెండరీ నటుడు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అట.
మెర్సల్, క్రాక్ లాంటి పెద్ద సినిమాలకు ఛాయాగ్రహణం అందించిన జీకే విష్ణు ఈ సినిమాకు కెమెరామన్‌గా పని చేస్తున్నాడు. అసలు దర్శకుడిగా తెలుగులో సినిమాలేవీ చేయని కుర్రాడికి నేరుగా బాలీవుడ్లో అవకాశం దక్కడం.. ఇలా పేరున్న నటీనటులు ముఖ్య పాత్రలు పోషించడం విశేషమే.
ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది వెల్లడి కాలేదు. బహుశా చరణ్ తేజ్ సొంతంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. ‘స్పై’ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే నిర్మాతలే సమకూర్చుకున్నారు. అందులో చరణ్ తేజ్ కూడా భాగస్వామి. ఐతే ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. మరి బాలీవుడ్లో దర్శకుడిగా చరణ్ తేజ్ ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.
This post was last modified on May 24, 2024 10:26 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…