మనమే ముందున్న అసలు ఛాలెంజ్

శర్వానంద్ – కృతి శెట్టి జోడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన మనమేని జూన్ 7 విడుదల చేయాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించుకుంది. ఆ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చేశారు.

కేవలం రెండు వారాల ముందు ఒక ఇమేజ్ ఉన్న హీరోకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఈ మధ్య కాలంలో దీనికే జరిగిందని చెప్పాలి. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా సరైన తేదీ కోసం ఎదురు చూసిన టీమ్ ఫైనల్ గా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి వారమే ఎంచుకుంది.

నిజానికి జూన్ 14 వస్తుందని మొన్నటిదాకా వినిపించింది. కానీ ఆ స్లాట్ లో ఇప్పటికే హరోం హర, రాయన్ ఉన్నాయి.

సో చేతిలో ఉన్న పధ్నాలుగు రోజులు మనమే బృందం ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. అసలే మధ్యలో జూన్ మూడు నుంచి అయిదు మధ్య ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ తాలూకు హడావిడి జనంలో ఎక్కువగా ఉంటుంది. థియేటర్లకు వెళ్లే మూడ్ లో పబ్లిక్ అంతగా ఉండరు.

సో మంచి బజ్ వచ్చేలా భారీ పబ్లిసిటీ చేసుకోవాలి. ఇది సక్సెస్ కావడం అందరికీ కీలకమే. ముఖ్యంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్న కృతి శెట్టి ఇది హిట్టయితే ఆక్సిజన్ లా పని చేస్తుంది. అశోక్ గల్లాతో తీసిన హీరో ఆశించిన ఫలితం దక్కకపోవడంతో శ్రీరామ్ ఆదిత్య సక్సెస్ కోసం తపిస్తున్నాడు. పెద్ద హీరోలు తనవైపు చూసేలా చేసుకోవాలి.

ఒక శర్వానంద్ కు ఒకే ఒక జీవితం హిట్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చేసింది. కారణాలు ఏమైనా ఇప్పుడు కంబ్యాక్ అవుతున్నాడు కాబట్టి అదేదో ఘనంగా ఉంటే బాగుంటుందనేది ఫ్యాన్స్ కోరిక. ఇంకా అబ్దుల్ హేశం వహాబ్ సంగీతాన్ని మార్కెట్ చేయాలి.

ట్రైలర్ లాంచ్, లిరికల్ వీడియోలు వగైరాలు వదలాలి. ఇంటర్వ్యూలు గట్రా చూసుకోవాలి. చేతిలో ఉన్న తక్కువ టైం మనమే టీమ్ కి ఒక ఛాలెంజ్ లాంటిది. మే 7 ప్రస్తుతానికి సత్యభామ ఒకటే కాంపిటీషన్ కనిపిస్తోంది. ఇంకా ఒకటో రెండో తోడవ్వచ్చు. చైల్డ్ సెంటిమెంట్ చుట్టూ తిరిగే మనమే ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంటోంది.