టాలీవుడ్ లోనే కాదు మొత్తం నాలుగు భాషల్లో అంత సులభంగా డేట్లు దొరకని హీరోయిన్ ఎవరయ్యా అంటే రష్మిక మందన్న పేరే వినిపిస్తోంది. పుష్పతోనే పేరు వచ్చినప్పటికీ యానిమల్ తర్వాత డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రన్బీర్ కపూర్ లాంటి పవర్ పెర్ఫార్మర్ ముందు ఏ మాత్రం తొణక్కుండా నటించిన తీరు అక్కడా బోలెడు అభిమానులను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం తను నటిస్తున్న లైనప్ చూస్తుంటే ఇంకో రెండేళ్ల దాకా డేట్లు బంగారం కన్నా విలువైందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పుష్ప 2 ది రూల్ పూర్తి చేసే పనిలో ఉన్న శ్రీవల్లి సమాంతరంగా గర్ల్ ఫ్రెండ్ లో నటిస్తోంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ డిఫెరెంట్ థ్రిల్లర్ ఎక్కువగా హైదరాబాద్ లోనే షూట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ మొదటిసారి జట్టు కట్టిన సికందర్ జూలై నుంచి సెట్స్ పైకి వెళ్తోంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధనుష్ జోడిగా కుబేర మంచి స్వింగ్ లో ఉంది. నాగార్జున కూడా ఉండటంతో మల్టీస్టారర్ క్రేజ్ మీద బిజినెస్ ఆఫర్లు భారీగా ఉన్నాయి. విక్కీ కౌశల్ నటిస్తున్న పీరియాడిక్ డ్రామా చావాలోనూ నటిస్తోంది. వీటికన్నా ముందు శాంతారుబన్ డైరెక్షన్ లోప్రకటించిన రైన్ బో అప్డేట్స్ ఎందుకనో రావడం లేదు.
శివ కార్తికేయన్ హీరోగా డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి తీయబోయే మూవీలోనూ తను దాదాపు ఓకే అయ్యిందనే వార్త చెన్నై మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోకి సైతం రష్మిక మందన్న పేరే పరిశీలనలో ఉందట. పుష్ప నిర్మాతలు, అందులోనూ మొదటిసారి తారక్ కాంబో అంటే నో అనకపోవచ్చు. ఇంత టైట్ డైరీని కొనసాగిస్తున్న రష్మిక మందన్న ఇంకో రెండు మూడేళ్ళ దాకా దొరికేలా లేదు. పుష్ప 2లో నిడివి పరంగా ఎక్కువ స్కోప్ దక్కిందని టాక్ ఉంది. అదే నిజమైతే శ్రీవల్లిగా మరోసారి మోత మోగించడం ఖాయమే. మాతృభాష కన్నడ నుంచి ఆఫర్లు వస్తున్నా చేసే పరిస్థితి లేదు.
This post was last modified on May 24, 2024 5:17 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…