Movie News

లవ్ మీ…..గెలిచి తీరాలి సుమీ

నెలన్నర రోజులకు పైగా విపరీతమైన నీరసంతో నడుస్తున్న బాక్సాఫీస్ కు సరైన హిట్ సినిమా రావడం కోసం ట్రేడ్ మాత్రమే కాదు ప్రేక్షక లోకం కూడా ఎదురు చూస్తోంది. ఎన్నికలు అయిపోయి వినోదం కోసం థియేటర్లకు వెళదామంటే సరైన ఛాయస్ లేక ఇంటికి పరిమితం కావడమో లేదా పార్కుల్లాంటి ఇతర ప్రత్యాన్మయాలు చూసుకుంటున్నారు ప్రేక్షకులు. ఐపీఎల్ ప్రభావం ఉన్నప్పటికీ థియేటర్లు ఖాళీగా ఉండడానికి కేవలం దాన్నే సాకుగా చూపించలేం. ఆ మాటకొస్తే సినిమాలను విపరీతంగా ప్రేమిస్తూ క్రికెట్ కి దూరంగా ఉండే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు కాబట్టి పూర్తిగా పరిగణించలేం.

ఈ నేపథ్యంలో రేపు లవ్ మీ ఇఫ్ యు డేర్ విడుదల కానుంది. అరుణ్ దర్శకత్వంలో ఆశిష్ హీరోగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా రూపొందిన ఈ హారర్ డ్రామాలో దెయ్యం ప్రేమనే వెరైటీ కాన్సెప్ట్ ని తీసుకున్నారు. ముందు నుంచి దిల్ రాజు దీని మీద గట్టి నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రతి చోటా బ్లాక్ బస్టర్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ మాటల్లో కనిపించింది. అదే జరగాలి కూడా. లవ్ మీ గెలిస్తేనే మిగిలిన వాళ్లకు ఉత్సాహం వస్తుంది. ఆశిష్ మొదటి ఆటకే ఓపెనింగ్స్ తీసుకొచ్చే హీరో కాకపోవచ్చు. అయితే టాక్ బాగా వస్తే సాయంత్రం నుంచే పికప్ చూపించే ప్రేమ మన జనాలది.

మా ఊరి పొలిమేర 2లో ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా మంచి థియేటర్ వసూళ్లు వచ్చాయి. అలాంటిది లవ్ మీకి క్యాస్టింగ్, సాంకేతిక బలం రెండూ పుష్కలంగా ఉన్నాయి. పైగా ఎస్విసి పంపిణి కావడంతో మంచి స్క్రీన్లు దొరుకుతున్నాయి. ఇది హిట్ అయితే వచ్చే వారం దాడి చేయబోతున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగం, గంగం గణేశాలకు ఎనర్జీ వస్తుంది. శుక్రవారం బదులు శనివారం రిలీజ్ ఎంచుకున్న లవ్ మీ వ్యూహం ఏదైనా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే మాత్రం వీకెండ్ నెంబర్లు బాగుంటాయి. పోటీలో ఉన్న రాజు యాదవ్ మరీ తీవ్రంగా ప్రభావం చూపించకపోవచ్చు.

This post was last modified on May 24, 2024 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

15 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

38 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

48 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago