బాలీవుడ్లో కథలకు బాగా కరువొచ్చేసింది. వాళ్లు ఈ మధ్య సౌత్ సినిమాల వైపు బాగా చూస్తున్నారు. ఇక్కడ ఏ సినిమా హిట్టయినా సరే.. అక్కడికి పట్టుకెళ్లిపోతున్నారు. మూల కథ తీసుకుని తమదైన టచ్ ఇచ్చి హిందీ ప్రేక్షకులకు అందిస్తున్నారు.
గత ఏడాది అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్, టెంపర్ రీమేక్ సింబా భారీ విజయం సాధించాక సౌత్ సినిమాలపై వారికి మరింత గురి కుదిరింది. ముఖ్యంగా తెలుగులో హిట్టయ్యే ప్రతి సినిమానూ వాళ్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.
నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమా సైతం అదే పేరుతో హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే మరికొన్ని రీమేక్‌ల కబుర్లు వినిపిస్తున్నాయి. నిరుడు టాలీవుడ్లో పెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సైతం హిందీలో రీమేక్ కాబోతున్నట్లు సమాచారం.
పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సెన్సేషనల్ హిట్టయింది. మాస్‌ను ఉర్రూతలూగించింది. దీని డబ్బింగ్ వెర్షన్‌కు కూడా హిందీలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయట. ఐతే ఈ రీమేక్ కోసం వినిపిస్తున్న హీరో పేరే ఆశ్చర్యం కలిగిస్తోంది.
చాక్లెట్ బాయ్ రణబీర్ హిందీ ఇస్మార్ట్ శంకర్‌గా కనిపిస్తాడట. అతను పక్కా క్లాస్ హీరో. లుక్స్ కూడా అలాగే ఉంటాయి. కెరీర్లో ఇప్పటిదాకా ఒక్క మాస్ సినిమా కూడా చేయలేదు. ఏ రణ్వీర్ సింగ్ లాంటోడో అయితే ఇస్మార్ట్ శంకర్ రీమేక్‌కు పక్కాగా సరిపోతాడనుకోవచ్చు. టెంపర్ రీమేక్ సింబాలో కూడా అతను అదరగొట్టాడు.
మరి అలాంటి వాణ్ని కాదని రణబీర్‌ను ఎలా కన్సిడర్ చేస్తున్నారో మరి. మరోవైపు కొత్త ఏడాదిలో మంచి విజయాలు సాధించిన అల వైకుంఠపురములో, హిట్ చిత్రాల్ని కూడా హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతుండటం విశేషం.
This post was last modified on April 27, 2020 4:08 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…