ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే రామ్ చరణ్ 16కి సంబంధించిన రకరకాల వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే ఈ విలేజ్ డ్రామాలో హీరోకు తల్లిగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒప్పుకున్నారనే టాక్ గట్టిగా తిరగడంతో అది నిజమేనేమోనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు అదంతా వట్టి పుకారే.
బలమైన క్యాస్టింగ్ కోసం బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవమే అయినా ఆవిడని కలుసుకోలేదని తెలిసింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత తాను ఇక నటించననని దాని ప్రమోషన్ల టైంలో లేడీ అమితాబ్ స్పష్టంగా చెప్పారు.
ఇప్పుడు హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం ఉండదు. విజయశాంతి ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఇలాంటి టైంలో మేకప్ వేసుకుని మళ్ళీ తెరమీద కనిపించే ఆలోచన ఎంత మాత్రం చేయరని సన్నిహితుల మాట.
కాసేపు ఈ గాసిప్పుని పక్కనపెడితే ఊహించుకోవడానికైతే ఈ కాంబో బాగుంది. ఒకప్పుడు చిరంజీవి విజయశాంతి కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ అబ్బాయికి విజయశాంతి తల్లిగా నటించడం బాగుంటుంది. మహేష్ బాబు సినిమాలో ఆవిడ పిల్లల తల్లిగా నటించారు కానీ హీరో పాత్రకు కాదనే విషయం మర్చిపోకూడదు.
వీలైనంత లీకులు రాకుండా రామ్ చరణ్ 16 టీమ్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక్క జాన్వీ కపూర్ పేరు మాత్రమే అధికారికంగా బయటికి వచ్చింది. గేమ్ ఛేంజర్ ఎప్పుడు పూర్తవుతుందో సరైన స్పష్టత లేని కారణంగా బుచ్చిబాబు ఇంకా వెయిటింగ్ మోడ్ లోనే ఉండాల్సి వస్తోంది. దీని నిర్మాణానికి కనీసం ఏడాది కావాలి.
మరీ ఆలస్యం చేస్తే చరణ్ తర్వాత సుకుమార్ తో చేయాల్సిన మూవీ లేట్ అవుతుంది. గురువు కోసమైనా బుచ్చిబాబు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు. ఏఆర్ రెహమాన్ మూడు పాటలు సమకూర్చిన ఆర్సి 16 మిగిలిన సాంగ్స్ రికార్డింగ్ ఈ వేసవిలోనే రికార్డు చేయబోతున్నట్టు తెలిసింది.
This post was last modified on May 23, 2024 6:15 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…