ప్రతి హీరోకి తమ అభిమాన స్టార్ లేదా ఫ్యామిలీకి సంబంధించిన రీమేకులు చేయాలని కోరికగా ఉంటుంది. ఉదాహరణకు రామ్ చరణ్ ఖైదీ, నాగ చైతన్య హలో బ్రదర్, మహేష్ బాబు గూఢచారి 116 టైపులో అన్న మాట.
ఆ క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ తాలూకు మేజిక్ ని మళ్ళీ పునఃసృష్టి చేయగలమో లేదో అనే అనుమానంతో వీటి జోలికి ఇక్కడ చెప్పిన వాళ్ళెవరూ వెళ్ళలేదు.
కానీ విశ్వక్ సేన్ మాత్రం తన ఫెవరెట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నా అల్లుడు తీయాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు. మే 31 విడుదల కాబోతున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రమోషన్ల సందర్భంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు.
నా అల్లుడు 2005 లో వచ్చింది. మాస్ లో మంచి పట్టు సంపాదించిన తారక్ ని అంతకు మించి చూపించాలంటే తాపత్రయంతో దర్శకుడు వర ముళ్ళపూడి సుప్రసిద్ధ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథను తీసుకున్నారు.
రమ్యకృష్ణ అత్తగా, శ్రేయ జెనీలియా హీరోయిన్లుగా ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడే మంచి క్రేజ్ వచ్చింది. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇంకేం రికార్డులు బద్దలే అనుకున్నారు. తీరా చూస్తే అంచనాలను నీరుగారుస్తూ నా అల్లుడు డిజాస్టరయ్యింది. కమర్షియల్ వాసనలు మరీ ఎక్కవైపోవడంతో ప్రేక్షకులు, అభిమానులు ఇద్దరూ సారీ చెప్పేశారు.
ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత విశ్వక్ సేన్ కి అది ఇష్టమైన సినిమా అని బయట పడటం ఆశ్చర్యం కలిగించే విషయం. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా సరైన మార్పులు చేసుకుంటే నా అల్లుడులో మంచి మాస్ స్టఫ్ ఉంది. బలహీనమైన రైటింగ్ వల్ల తేలిపోయింది.
ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు గ్లామర్ అత్తకు మాస్ అల్లుడు తరహాలో పక్కాగా రాసుకుంటే హిట్ కొట్టొచ్చని విశ్వక్ ఉద్దేశం కావొచ్చు. అయినా ఈ మధ్య ఒకప్పటి డిజాస్టర్లకు కల్ట్ స్టేటస్ వచ్చి జనాలు థియేటర్లలో ఎగబడి చూసినట్టు ఒకవేళ నా అల్లుడుని సరిగా తీస్తే సక్సెస్ దక్కుతుందేమో. ఏ పుట్టలో ఏ పాముందో తరహాలో జరిగితే చూడాలి.
This post was last modified on May 23, 2024 6:13 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…