Movie News

అవును.. ఆ సినిమాలో ఉపేంద్ర ఉన్నాడు

కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న నటుడంటే ఉపేంద్రనే. ‘ఉపేంద్ర’, ‘ఎ’, ‘రా’ లాంటి డబ్బింగ్ సినిమాలతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడతను. ఆ తర్వాత తెలుగులోనూ నేరుగా ‘కన్యాదానం’ లాంటి కొన్ని సినిమాల్లో నటించాడు. ఐతే ఆ తర్వాత ఎందుకో గ్యాప్ వచ్చేసింది. తెలుగులో నటించలేదు.

అతడి డబ్బింగ్ సినిమాల సందడి కూడా తగ్గిపోయింది. చాలా ఏళ్ల విరామం తర్వాత అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో అతను తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో కీలక పాత్రలో బాగానే మెరిశాడు. ఐతే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఉపేంద్ర మళ్లీ ఇటు చూడలేదు. మళ్లీ గ్యాప్ తీసుకున్న ఉపేంద్ర.. ఇప్పుడు మరో మెగా హీరో సినిమాతోనే తెలుగులోకీ రీరీఎంట్రీ ఇవ్వనున్నాడు.

మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కొత్త చిత్రంలో ఉపేంద్ర నటిస్తాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం ఈ రోజు ధ్రువీకరణ అయింది. శుక్రవారం ఉపేంద్ర పుట్టిన రోజు కాగా.. వరుణ్ కొత్త సినిమా బృందం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. తమ చిత్రంలో ఉప్పి ఉన్నాడన్న సంగతి కన్ఫమ్ చేసింది.

కిరణ్ కొరపాటి అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. వేసవిలోనే ఈ సినిమా మొదలై, ఈపాటికి పూర్తి కావాల్సింది కానీ.. కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈ ఖాళీలో వరుణ్ మరింతగా బాక్సింగ్ సాధన చేశాడు. ఫిట్నెస్ పెంచుకున్నాడు.

వరుణ్ కటౌట్‌కు బాక్సింగ్ నేపథ్యంలో సినిమా అంటే భలేగా సెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ భామ నభా నటేష్ కథానాయికగా నటించనుందట. అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ (బాబీ) సొంతంగా నిర్మించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

This post was last modified on September 18, 2020 2:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago