దర్శకుడు సుకుమార్ కు అతి పెద్ద సమస్యగా మారిన పుష్ప 2 ది రూల్ స్పెషల్ సాంగ్ కు పరిష్కారం దొరికిందని తాజా సమాచారం. యానిమల్ లో కనిపించేది తక్కువ నిడివి అయినా రష్మిక మందన్నతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రిని లాక్ చేసుకున్నట్టు యూనిట్ వర్గాల టాక్. నిజమో కాదో తేలాలంటే షూట్ మొదలయ్యే దాకా చెప్పలేం కానీ విశ్వసనీయంగా వింటున్న ప్రకారం ఇది నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గత రెండు నెలలుగా పైగా సుక్కు టీమ్ కొనసాగిస్తున్న వేట ఎక్కడ రిలీజ్ డేట్ మీద ప్రభావం చూపిస్తుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.
ఏదైతేనేం ఫైనల్ గా సొల్యూషన్ దక్కడమే అందరికీ కావాల్సింది. ఒకదశలో దిశా పటానిని కూడా ట్రై చేశారు కానీ పనవ్వలేదు. పుష్ప 1లో ఊ అంటావా ఊహు అంటావా సమంత ఒలికించిన హొయలకు ధీటుగా ఇప్పుడు త్రిప్తి మెప్పించాల్సి ఉంటుంది. మరి అంత మేజిక్ చేస్తుందో లేదో స్క్రీన్ మీద చూశాకే క్లారిటీ వస్తుంది. ఈ నెల వారం రోజులు మినహాయిస్తే పుష్ప విడుదలకు కేవలం 75 రోజులు మాత్రమే ఉంది. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్, రీ రికార్డింగ్, ప్రమోషన్ ప్లాన్ అన్నీ జరిగిపోవాలి. మలేషియా షెడ్యూల్ ని ఫిలిం సిటీలో సెట్ వేసి కానిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత టైట్ గా ఉందో.
ఇప్పటికే ఒక ఆడియో సాంగ్ రిలీజ్ చేసిన పుష్ప బృందం ఈ నెల 29న అల్లు అర్జున్, రష్మిక మందన్న మధ్య వచ్చే మెలోడీ డ్యూయెట్ ని విడుదల చేయనుంది. ఆడియో పరంగా దేవిశ్రీ ప్రసాద్ అంచనాలు నిలబెట్టుకుంటాడనే అభిమానుల్లో బలంగా ఉంది. బిజినెస్ క్రేజ్ మోస్తున్న పుష్ప 2 థియేట్రికల్ డీల్స్ ని ఇంకా క్లోజ్ చేయలేదు. పూర్తి స్థాయి టీజర్ వచ్చాక లెక్కలు మారతాయనే ధీమాలో నిర్మాతలున్నట్టు కనిపిస్తోంది. కల్కి 2898 ఏడి, భారతీయుడు 2 తర్వాత మళ్ళీ అంతకు మించిన స్థాయిలో బాక్సాఫీస్ కు ఊపు తెచ్చే సినిమాగా పుష్ప 2 మీదున్న హైప్ కి ఆకాశమే హద్దుగా నిలుస్తోంది.
This post was last modified on May 23, 2024 1:28 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…