కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న నటుడంటే ఉపేంద్రనే. ‘ఉపేంద్ర’, ‘ఎ’, ‘రా’ లాంటి డబ్బింగ్ సినిమాలతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడతను. ఆ తర్వాత తెలుగులోనూ నేరుగా ‘కన్యాదానం’ లాంటి కొన్ని సినిమాల్లో నటించాడు. ఐతే ఆ తర్వాత ఎందుకో గ్యాప్ వచ్చేసింది. తెలుగులో నటించలేదు. అతడి డబ్బింగ్ సినిమాల సందడి కూడా తగ్గిపోయింది.
చాలా ఏళ్ల విరామం తర్వాత అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో అతను తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో కీలక పాత్రలో బాగానే మెరిశాడు. ఐతే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఉపేంద్ర మళ్లీ ఇటు చూడలేదు. మళ్లీ గ్యాప్ తీసుకున్న ఉపేంద్ర.. ఇప్పుడు మరో మెగా హీరో సినిమాతోనే తెలుగులోకీ రీరీఎంట్రీ ఇవ్వనున్నాడు.
మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కొత్త చిత్రంలో ఉపేంద్ర నటిస్తాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం ఈ రోజు ధ్రువీకరణ అయింది. శుక్రవారం ఉపేంద్ర పుట్టిన రోజు కాగా.. వరుణ్ కొత్త సినిమా బృందం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. తమ చిత్రంలో ఉప్పి ఉన్నాడన్న సంగతి కన్ఫమ్ చేసింది.
కిరణ్ కొరపాటి అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. వేసవిలోనే ఈ సినిమా మొదలై, ఈపాటికి పూర్తి కావాల్సింది కానీ.. కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈ ఖాళీలో వరుణ్ మరింతగా బాక్సింగ్ సాధన చేశాడు. ఫిట్నెస్ పెంచుకున్నాడు. వరుణ్ కటౌట్‌కు బాక్సింగ్ నేపథ్యంలో సినిమా అంటే భలేగా సెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ భామ నభా నటేష్ కథానాయికగా నటించనుందట. అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ (బాబీ) సొంతంగా నిర్మించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
This post was last modified on September 18, 2020 3:48 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…