తమిళ స్టార్ హీరో విజయ్ కు కొన్నేళ్ల క్రితం ఇతర భాషల్లో అంతగా మార్కెట్ ఉండేది కాదు కానీ తుపాకీ తర్వాత ఒక్కసారిగా పెను మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా తెలుగులో విజిల్, మాస్టర్, అదిరింది లాంటివి కమర్షియల్ గా బాగా పే చేయడం వల్ల డబ్బింగ్ హక్కుల కోసం డిమాండ్ పెరిగింది. సహజంగానే ఇది డిజిటల్ రైట్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అతని తాజా సినిమా గోట్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంను నెట్ ఫ్లిక్స్ సంస్థ 110 కోట్లకు ఒప్పందం చేసుకుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అధికారికంగా చెప్పలేదు కానీ దాదాపు కన్ఫర్మేనని చెన్నై వర్గాల సమాచారం.
ఒక సౌత్ మూవీకి ఇంత డిమాండ్ అంటే కేవలం ఆ క్రెడిట్ విజయ్ కు మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే గోట్ దర్శకుడు వెంకట్ ప్రభు ఫ్లాపులొ ఉన్నాడు. గత చిత్రం నాగచైతన్య కస్టడీ ఎంత డిజాస్టరో తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సైతం క్రేజ్ లో లేడు. ఇన్ని ప్రతికూలతల మధ్యలోనూ ఆ రేట్ కేవలం విజయ్ ఇమేజ్ వల్లే తప్ప మరొకటి కాదనేది అభిమానుల కామెంట్. దీన్ని కాదనలేం. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిక్షన్ డ్రామాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పాతికేళ్ల కుర్రాడిగా, మధ్య వయస్కుడిగా రెండు షేడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి.
మరో కారణం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. పొలిటికల్ ఎంట్రీకి ముందు విజయ్ చేయబోయే రెండు సినిమాల్లో ఈ గోట్ ఒకటి. మళ్ళీ స్క్రీన్ మీద కొత్తగా చూడటం సాధ్యం కాబట్టి ప్రేక్షకులు ఎగబడి చూస్తారనే అంచనాలు అన్ని వర్గాల్లో బలంగా ఉన్నాయి. ప్రశాంత్, లైలా, ప్రభుదేవా, స్నేహ, జయరామ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న గోట్ సెప్టెంబర్ 5 విడుదల కానుంది. ఎలాంటి వాయిదా లేకుండా ఖచ్చితంగా రిలీజ్ చేసేలా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. స్కైఫై జానర్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు హక్కులని త్వరలోనే క్లోజ్ చేయబోతున్నారు.
This post was last modified on May 22, 2024 4:26 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…