Movie News

దిల్ రాజు వ్యూహాత్మక మౌనం ఇందుకేనా

మాములుగా తన ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా రిలీజ్ కు ముందు నిర్మాత దిల్ రాజు చేసే ప్రమోషన్లు మాములుగా ఉండవు. అయితే ఈ శనివారం మే 25 విడుదల కాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. ది ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో ఆయన చూపించిన కాన్ఫిడెన్స్, చెప్పిన మాటలు అన్నీ రిజల్ట్ వచ్చాక నీరుగారిపోయాయి. యావరేజ్ అయినా ఫీలయ్యేవారు కాదేమో కానీ మరీ దారుణంగా ఫ్లాప్ కావడం ఊహించలేదు. అందుకే లవ్ మీ కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే సక్సెస్ అయ్యాక మాట్లాడాలని నిర్ణయించుకున్నారు కాబోలు.

లవ్ మీ తీసిన ఆయన కూతురే అయినప్పటికీ నిర్మాణ తదితర వ్యవహారాలన్నీ రాజుగారే దగ్గరుండి చూసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆశిష్ మాట్లాడుతూ మూసుకున్న థియేటర్లన్నీ దీంతో తెరుచుకుంటాయని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. దిల్ రాజు మాత్రం రాజకీయ నాయకులకు జూన్ 4 ఎలాగో మాకు మే 25 అలా అని టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇవాళ మహేష్ బాబుతో ఎక్స్ వేదికగా ఓ పాటను రిలీజ్ చేయించారు. కీరవాణి సంగీతం ఆశించిన స్థాయిలో బజ్ తేలేకపోవడం లవ్ మీకి ప్రతికూలంగా మారింది. పైగా వైష్ణవి చైతన్య బ్రాండ్ కూడా ఏమంత పని చేయడం లేదు.

ఇవన్నీ గమనిస్తే మొదటి రోజు షోలయ్యాక పబ్లిక్ టాక్, రివ్యూలు చూశాకే దిల్ రాజు దీని గురించి స్పీడ్ పెంచుతారని అనుకోవచ్చు. గత ఏడాది బలగంకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మధ్య హారర్ టచ్ ఉన్న సినిమాలు ఎక్కువే వచ్చాయి. మా ఊరి పొలిమేర 2, విరూపాక్ష, ఓం భీం బుష్, మంగళవారం, గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇలా చెప్పుకోదగ్గ కౌంట్ లోనే బాక్సాఫీస్ ని పలకరించాయి. వీటిలో వర్కౌట్ అయినవే ఎక్కువ. మరి దెయ్యాన్ని ప్రేమించే పాయింట్ తో వచ్చిన లవ్ మీ ఇఫ్ యు కెన్ ఏ క్యాటగిరీలో వస్తుందో చూడాలి.

This post was last modified on May 22, 2024 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్యకు అల్లు అరవింద్ హామీ

తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…

14 minutes ago

‘గేమ్ చేంజర్’ టీంకు సెన్సార్ బోర్డు చురక

తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టాలన్న స్పృహ రాను రాను తగ్గిపోతూ వస్తోంది. ఈ ఒరవడి తెలుగులోనే కాదు.. వేరే…

55 minutes ago

విడాముయర్చి గొడవ… రాజీ కోసం లైకా ప్రయత్నాలు

ఒకప్పుడు విదేశీ భాషలకు చెందిన సినిమాలను మన ఫిలిం మేకర్స్ యథేచ్ఛగా కాపీ కొట్టేసి సినిమాలు తీసేసేవారు. వాటి గురించి…

2 hours ago

పవన్ నన్ను దేవుడిలా ఆదుకున్నారు : నటుడు వెంకట్

టాలీవుడ్ పవన్ స్టార్, ఏపీ డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మానవతావాది అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు…

2 hours ago

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది?

భారత క్రికెట్ జట్టు మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు జట్టులో అనేక…

3 hours ago

15 సంవత్సరాల స్వప్నం… సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్

అభిమానులు రోజుకు కనీసం ఒక్కసారైనా తలుచుకోనిదే నిద్రపోని ఎస్ఎస్ఎంబి 29 ఇవాళ పూజ కార్యక్రమంతో మొదలైపోయింది. టాలీవుడ్ నే కాదు…

4 hours ago