Movie News

బేబీ ఇమేజ్ ఉపయోగపడటం లేదే

గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో రీమేక్ చేసే స్థాయికి తీసుకెళ్లింది. అప్పటిదాకా షార్ట్ ఫిలింస్, సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన వైష్ణవి చైతన్యకు ఒక్కసారిగా ఈ టైటిల్ రోల్ పోషించినందుకు చాలా పేరొచ్చింది.

అమాయకత్వం ముసుగులో ప్రేమించి దగాపడే అమ్మాయిగా తన పెర్ఫార్మన్స్ ఏ కోణంలోనూ తక్కువ చేసి చూడలేం. సహజంగానే ఇంత భారీ విజయం దక్కినప్పుడు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడతాయి. వాటిలో భాగంగానే దిల్ రాజు ఫ్యామిలీ నిర్మాణంలో వస్తున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ అవకాశం దక్కించుకుంది.

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న లవ్ మీ మీద ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ వగైరాలు చేశారు కానీ హీరో ఆశిష్ కు ఇమేజ్ లేకపోవడం, హారర్ జానర్లో ఏదో ప్రయోగాత్మకంగా ట్రై చేయడం లాంటివి అంచనాలు పెంచలేకపోయాయి.

ముఖ్యంగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన సంగీతం లవ్ మీ మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోవడం అసలు దెబ్బ. సరే ఇదంతా పక్కన పెడితే వైష్ణవి చైతన్యకి బేబీ ద్వారా వచ్చిన బ్రాండ్ ఏదైతే ఉందో ఇప్పుడీ లవ్ మీకి పెద్దగా ఉపయోగపడకపోవడం విచిత్రమే.

ఇది హిట్ అయితే సంతోషమే కానీ దెయ్యాన్ని ప్రేమించే యువకుడి చుట్టూ తిరిగే పాయింట్ తో రూపొందిన లవ్ మీలో వైష్ణవికి ఎంత మేరకు స్కోప్ దక్కిందో 25న థియేటర్లలో చూస్తే తప్ప క్లారిటీ రాదు.

సిద్దు జొన్నలగడ్డతో జాక్ రూపంలో జాక్ పాట్ కొట్టిన వైష్ణవి చైతన్యకి అది కనక హిట్ అయితే టాప్ లీగ్ వైపు మెల్లగా అడుగులు వేయొచ్చు. శ్రీలీల జోరు తగ్గిపోయి, పూజా హెగ్డే ముంబైకి పరిమితమై, రష్మిక మందన్న డేట్లు దొరకని పరిస్థితుల్లో వైష్ణవి చైతన్య లాంటి వాళ్లకు కెరీర్ నిర్మించుకోవడానికి ఇది మంచి అవకాశం. కాకపోతే వరస సక్సెస్ లు పలకరిస్తూ ఉండాలి. మరి లవ్ మీ ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on May 21, 2024 9:29 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

34 minutes ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

3 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

3 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

3 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

3 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

4 hours ago