నాలుగేళ్ల క్రితం చేసిన రక్షణ అనే సినిమా నిర్మాతలు ప్రమోషన్ కోసం తనను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మొన్న సోషల్ మీడియాలో వేసిన పోస్ట్ సంచలనం రేపడం చూశాం. ఆమె ఆవేదన చూసి నిజమే కాబోలు, ఇలా కూడా టార్గెట్ చేస్తారా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధికారికంగా జారీ చేసిన నోటీస్ లో పలు విషయాలను కూలంకుషంగా వివరించడంతో అసలు ట్విస్టులు వెలుగు చూశాయి. పారితోషికంలో బాకీ ఉన్న ఆరు లక్షలు చెల్లించేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెనే సుముఖంగా లేదనే విషయం బయట పడింది.
ఆ మొత్తాన్ని కౌన్సిల్ దగ్గరే జమచేసిన ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ ప్రణ్ దీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మాతల సమాఖ్య ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. అగ్రిమెంట్ ప్రకారం యాభై రోజులు పని చేయాల్సిన పాయల్ ను నలభై ఏడు రోజులకే టీమ్ వినియోగించుకుంది. క్లాజ్ 16 మేరకు షూట్ అయ్యాక ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన బాధ్యత ఆమెకు ఉందని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావించారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ లో తనకు సభ్యత్వం లేని సంగతి కూడా ఇటీవలే తెలిసిందట. పాయల్ మేనేజర్ సౌరభ్ సరైన రీతిలో స్పందించకపోవడం గురించి నోట్లో వివరించారు.
నాలుగేళ్ల పాత సినిమా కాబట్టి తాను ఏమి చేయనని చెప్పడం సమంజసం కాదనేది కౌన్సిల్ నుంచి చెబుతున్న మాట. నిజమే. కారణాలు ఏమైనా ప్రాజెక్ట్ ఆలస్యమైనప్పుడు రిలీజ్ టైంకి సహకరించడం అందరి బాధ్యత. పైగా కోవిడ్ సమయంలో ఎన్నో కష్టనష్టాలు భరించి రక్షణను పూర్తి చేశామని ప్రణ్ ధీప్ చెప్పుకొచ్చారు. సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఇలా సామజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వాస్తవాలు దాచి చెప్పడం పట్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంత స్పష్టంగా నిజానిజాలు కనిపిస్తున్న ఇష్యూలో పాయల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on May 21, 2024 11:01 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…