అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్ స్వయంగా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో థర్డ్ పార్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.
సీక్వెల్ జూలైలో విడుదలకు సిద్ధం కానుండగా భారతీయుడు 3 ఆరు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఐపీఎల్ కు విచ్చేసిన సందర్భంలో చెప్పడంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. దర్శకుడు శంకర్ ఇంత పెద్ద కాన్వాస్ ని మూడు గంటల్లో చెప్పడం అసాధ్యమని గుర్తించడం వల్లే ఒప్పుకున్నానని కమల్ చెప్పడం గమనార్హం. ఇక్కడో ట్విస్టు ఉంది.
భారతీయుడు 2 జూలైలో వచ్చి ఆపై ఆరు నెలల గ్యాప్ అంటే భారతీయుడు 3 సరిగ్గా జనవరిలో సంక్రాంతికి రావాలి. అంటే మన దగ్గర చిరంజీవి, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్లతో క్లాష్ అవ్వడానికి సిద్ధపడాలి . ఇదంతా ఓకే కానీ మరి గేమ్ ఛేంజర్ సంగతేంటంటే మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు.
దీని విషయంలో విపరీతమైన జాప్యం ఎందుకు జరిగిందో ఇప్పుడు అర్థమయ్యింది. ఇండియన్ రెండు భాగాలు సమాంతరంగా షూట్ చేయడం వల్ల శంకర్ మొత్తం మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి తీసినట్టు అయ్యింది. అందుకే కమల్, రామ్ చరణ్ ఇద్దరికీ వాయిదాలు తప్పలేదు.
సరే ఏదో ఒకటి క్లారిటీ వచ్చేసిందని ఆనందపడుతున్నా భారతీయుడు 2 డేట్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదన్న సంగతి మర్చిపోకూడదు. సో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చాక కానీ చెప్పలేం. ఒకవేళ శంకర్ కేవలం రామ్ చరణ్ ది మాత్రమే చేసుంటే ఈపాటికి రిలీజైపోయి ఓటిటి ప్రీమియర్ కూడా ఎప్పుడో అయిపోయేదని మెగా ఫ్యాన్స్ ఫీలవ్వడంలో అర్థముంది.
ఇదంతా ఒకే కానీ భారతీయుడుకి ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడంతో కమల్ స్వయంగా రంగంలోకి దిగి భారీ పబ్లిసిటీలో భాగం కాబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
This post was last modified on May 19, 2024 8:26 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…