Movie News

సందీప్ వంగాకు ఒకలా భన్సాలీకి మరోలా

యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేయడం చూశాం.

అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టు ఒక అడుగు ముందుకేసి ఆ సినిమాలో నటించినందుకు ఫీలవుతున్నానని చెప్పడం సోషల్ మీడియాలో ఇష్యూ అయ్యింది.

జావేద్ అక్తర్, కిరణ్ రావు తదితర ప్రముఖులు చేసిన నెగటివ్ కామెంట్స్ ని సందీప్ వంగా సమర్ధవంతంగా తిప్పి కొట్టాడు. అఫ్కోర్స్ కరణ్ జోహార్ లాంటి వాళ్ళు యానిమల్ కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు లేకపోలేదు. ఇదంతా చెప్పడానికి కారణముంది.

ఇటీవలే భారీ తారాగణంతో నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన హీరామండి వెబ్ సిరీస్ కు మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడ్డాయి కానీ కంటెంట్ గురించి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇలాంటిది ఆశించలేదని, ఆయన స్థాయి పనితనం కాదని చెప్పిన వాళ్లే ఎక్కువ. రివ్యూస్ సైతం మాస్టర్ పీస్ అని పొగడలేదు.

స్వాతంత్రం రాకముందు పాకిస్థాన్ లో ఉండే ఒక వేశ్యవాటిక చుట్టూ నడిపిన కథని భన్సాలీ పెద్ద క్యాస్టింగ్ తో తెరకెక్కించాడు. అయితే అభ్యంతరం అనిపించే సీన్లు, ఇంటిమసీ ఎపిసోడ్లు ఇందులో లేకపోలేదు. కానీ ఎవరూ వేలెత్తి చూపలేదు.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో భన్సాలీ మాట్లాడుతూ తనకు రేషన్ షాపులో నిలబడి బియ్యం చెక్కర తీసుకునే మహిళలు ఎలాంటి స్ఫూర్తి ఇవ్వరని, అదే ఒక వేశ్య జీవితంలో ఎంతో మిస్టరీ ఉంటుందని అందుకే వాళ్ళ కథలు చెప్పేందుకు ఇష్టపడతానని చెప్పడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మిడిల్ క్లాస్ జీవితాలు చప్పగా ఉంటాయని చెప్పడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శ్యామ్ బెనెగల్ తీసిన క్లాసిక్స్ నుంచి ఇప్పటి లాపతా లేడీస్ దాకా ఉదాహరణలు చెబుతున్నారు. సందీప్ వంగా ఏదైనా అంటేనే ఇంతెత్తున లేచే కొన్ని వర్గాలు భన్సాలీకి మాత్రం మౌనంగా మినహాయింపు ఇచ్చాయి.

This post was last modified on May 19, 2024 6:48 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

4 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

47 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago