ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదనేది స్పష్టం. ప్రమోషన్లలో ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు మైత్రి మేకర్స్. దీని మీదున్న క్రేజ్ చూసి పోటీ వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అజయ్ దేవగన్ సింగం అగైన్ ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంది కానీ నిజానికి క్లాష్ అయితే వచ్చే నష్టం తనకేనని తెలుసు కాబట్టే డ్రాప్ అయ్యిందనేది బహిరంగ రహస్యం. పైగా నార్త్ నుంచి సౌత్ దాకా పుష్ప మేనియా మాములుగా లేదు. కానీ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మాత్రం పుష్ప 2ని ఢీ కొడతానని అంటున్నారు.
ఈయన హీరోగా భైరతి రణగల్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ మఫ్టీకి కొనసాగింపు. గతంలో ఇక్కడ రీమేక్ చేయాలని చూశారు కానీ సాధ్యపడలేదు. రామ్ చరణ్, విజయ్ దేవరకొండలకు కథలు చెప్పి ఒప్పించలేకపోయిన నర్తన్ దీనికి దర్శకుడు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అది కూడా ఆగస్ట్ 15. మరి పుష్ప 2తో తలపడటం రిస్క్ కదాని మేకర్స్ ని అడిగితే తమ కంటెంట్ మీద నమ్మకం ఉందని, ఇతర బాషా చిత్రాల కోసం రాజీ పడే సమస్యే లేదని అంటున్నారు. అంతే కాదు మల్టీ లాంగ్వేజ్ విడుదలకు ప్లాన్ చేస్తామని కుండ బద్దలు కొట్టేశారు.
ఇంత ధైర్యంగా ఉండేందుకు కారణం లేకపోలేదు. గత ఏడాది డిసెంబర్ లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చినప్పుడు కాటేరా ఆ తాకిడిని తట్టుకుని శాండల్ వుడ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరో దర్శన్ ప్రెస్ మీట్ లో చూపించిన కాన్ఫిడెన్స్ నిజమయ్యింది. మలయాళంలో మోహన్ లాల్ నేరు అదే సమయంలో వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2తోనూ తమకు అలాంటి ఫలితమే వస్తుందనే ధీమా భైరతి రణగల్ మేకర్స్ లో కనిపిస్తోంది. సప్తసాగారాలు దాటి సైడ్ ఏబి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ కాగా కెజిఎఫ్ రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. తెలుగు డబ్ కూడా చేస్తారు.
This post was last modified on May 19, 2024 12:45 pm
ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…
ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…
దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…
నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా…
వైసీపీ మాజీ మంత్రి, కీలక నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.…