గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి స్థాయి ప్రకటనే రాలేదు. అల్లు అర్జున్ తో ప్రాజెక్టు అధికారికంగా కన్ఫర్మ్ అయినా ఎప్పుడు ఉంటుంది, క్యాస్టింగ్, సాంకేతిక వర్గం తదితర వివరాలు బయట పెట్టలేదు. త్రివిక్రమ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో స్క్రిప్ట్ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని సిద్ధం చేస్తున్నారని టాక్. అయితే పుష్ప 2 ది రూల్ రిలీజయ్యాక బన్నీ వెంటనే త్రివిక్రమ్ సెట్లో అడుగు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. అట్లీ లేదా పుష్ప 3 వీటిలో ఒకటి ఉంటుంది.
అప్పటిదాకా ఖాళీగా ఉండటం ఎందుకని త్రివిక్రమ్ ఈలోగా అఆ తరహాలో ఒక కూల్ ఎంటర్ టైనర్ తీసే ఆలోచనలో ఉన్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ఎనర్జిటిక్ రామ్ తో ఒక సినిమా చేయించాలని నిర్మాత స్రవంతి రవికిశోర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దర్శకుడిగా త్రివిక్రమ్ కు నువ్వే నువ్వే రూపంలో మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే. ఆ కృతజ్ఞత మాటల మాంత్రికుడికి ఎప్పుడూ ఉంటుంది. నువ్వు నాకు నచ్చావ్ స్క్రిప్ట్ ని సురేష్ బాబు కంటే ఎక్కువ నమ్మింది రవికిషోరే. అందుకే రామ్ కాంబోలో ఒక మూవీ చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ సాధ్యపడలేదు.
ఇకవేళ త్రివిక్రమ్ సానుకూలంగా స్పందిస్తే రామ్ తో ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కథ పరంగా ఇబ్బంది లేదట. రెడీగానే ఉందని, కాకపోతే వందల కోట్ల మార్కెట్ ఉన్న స్టార్లతో చేసి ఇప్పుడు టయర్ 2 హీరోలతో జట్టు కట్టడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్టు ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. ఏదీ అడగాలన్నా త్రివిక్రమ్ ఎక్కడ మీడియా ముందుకు రావడం లేదు. పోనీ ఏదైనా ఈవెంట్ కి వస్తే అడుగుదామంటే ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. మరి పూర్తిగా అల్లు అర్జున్ సినిమా మీదే దృష్టి పెడతారా లేక నితిన్ కి హిట్ ఇచ్చినట్టు రామ్ కి బ్రేక్ దక్కడం కోసం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
This post was last modified on May 18, 2024 1:32 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…