ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వగైరాలు. ఒకప్పుడు ఎస్విసిని ఇంతే స్పీడ్ తో పరుగులు పెట్టించిన దిల్ రాజు ఈ మధ్య నెమ్మదించారని అనుకుంటారు కానీ వాస్తవానికి ఆయన కమిట్ మెంట్లు చూస్తే పైన చెప్పిన వాళ్ళ కన్నా ఎక్కువగా అనిపిస్తాయి. అదెలాగో చూద్దాం. ఈ నెల ఇరవై అయిదున విడుదల కాబోతున్న ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ కూతురి ప్రొడక్షనే అయినా మొత్తం దగ్గరుండి నాన్నే చూసుకుంటున్నారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ గురించి తెలిసిందే. నితిన్ ‘తమ్ముడు’ సగానికి పైగానే పూర్తయ్యింది.
న్యాచురల్ స్టార్ నాని బలగం వేణు కాంబో ‘ఎల్లమ్మ’ లాక్ అయిపోయింది. పూజా లాంఛనాల రోజు అధికారికంగా ప్రకటిస్తారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా సెట్స్ పైకి వెళ్లాల్సినవి ఏంటో చూద్దాం. ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టరైనా పరశురామ్ కి ఇంకో ఆఫర్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు. వెంకటేష్ – అనిల్ రావిపూడిల కాంబో జూన్ నుంచి షూటింగ్ వెళ్లొచ్చు. షాహిద్ కపూర్ – వంశీ పైడిపల్లి కాంబోతో బాలీవుడ్ లో జెండా పాతాలని దిల్ రాజు బలంగా ప్లాన్ చేసుకున్నారు. సుహాస్ హీరోగా సందీప్ బండ్లతో ఓ ప్రాజెక్టు చర్చల తుది దశలో ఉంది.
ఎప్పటినుంచో బాలకృష్ణతో చేయాలనుకున్న మూవీ త్వరలో సాధ్యం కావొచ్చు. రవితేజ ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు కానీ కాంబో సెట్ అవ్వాలి. హిట్ సిరీస్ శైలేష్ కొలను కథకు హీరో దొరికితే పట్టాలు ఎక్కొచ్చట. ధనుష్ – శ్రీకారం కిషోర్ రెడ్డిల కలయికకు దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. శతమానం భవతి నెక్స్ట్ పేజీని ఆశిష్ తో తెరకెక్కించాలని దిల్ రాజు ఆలోచన. సిద్దు జొన్నలగడ్డతో ఒకటి పెండింగ్ ఉంది. దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, శ్రీకాంత్ అడ్డాల తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త దర్శకుడితో వెంకటేష్ హీరోగా మరో ప్రతిపాదన ఉంది. ఇవన్నీ రెండు మూడేళ్ళలో దాదాపుగా తెరకెక్కేవే.
This post was last modified on May 17, 2024 2:33 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…