సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం. దీని మీద గతంలో ఎన్నో చర్చలు జరిపి స్వయం నిబంధనలు పాటించాలని టాలీవుడ్ పెద్దలు ప్రయత్నించినా అవేవి ఫలితం ఇవ్వడం లేదు. ఇప్పుడీ టాపిక్ కి కారణం కృష్ణమ్మ. నిన్న రాత్రి నుంచి చెప్పాపెట్టకుండా హఠాత్తుగా ఊడిపడిన పిడుగులా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడం చూసి జనాలు షాక్ తిన్నారు. ఎందుకంటే రెండో వారంలో అడుగుపెట్టే ముందు రోజు ఇంత త్వరగా చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉన్న సినిమా డిజిటల్ లో రావడం ఈ మధ్య కాలంలో జరగలేదు.
దీని గురించి సర్వత్రా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణమ్మ బాక్సాఫీస్ రిజల్ట్ ఏమైనా ఉండొచ్చు. కానీ మరీ ఏడో రోజే ఇలా స్ట్రీమింగ్ కి ఇచ్చేయడం వల్ల ప్రేక్షకులకు ఏం సంకేతం ఇస్తున్నారని నెటిజెన్లు నిలదీస్తున్నారు. ఒకపక్క సింగల్ స్క్రీన్లు తాత్కాలికంగా అయినా సరే మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతుంటే ఇంకోవైపు థియేటర్లలో ఆడుతున్న సినిమాని ఇలా ఓటిటికి ఇచ్చేయడం ఏమిటనే ప్రశ్నకు సమాధానం దొరకదు. బహుశా ఎలాగూ ఆడదని ముందే ఒప్పందం చేసుకున్నారా లేక ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయమా అనేది నిర్మాతలకే తెలుసు.
ఇరవై రోజుల గ్యాపే చాలా తక్కువని భావిస్తున్న తరుణంలో మరీ ఏడు రోజులనేది ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. బాలీవుడ్ లో ఇలా లేదు. ఖచ్చితంగా యాభై రోజుల కండీషన్ పాటిస్తేనే తమ స్క్రీన్లు ఇస్తామని మల్టీప్లెక్సులు గట్టి పట్టు పట్టడంతో నార్త్ ప్రొడ్యూసర్లు దాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే గత మూడేళ్ళలో ఏ హిందీ సినిమా నెల రోజుల్లో వచ్చిన దాఖలాలు కనిపించవు. అంతెందుకు మొదటి ఆటకే టపా కట్టిన బస్తర్ నక్సల్ స్టోరీ అందరూ మర్చిపోయాక వచ్చింది. జర హట్కే జర బచ్కెకు పదకొండు నెలలు పట్టింది. కానీ మన దక్షిణాదిలో మాత్రమే దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది.
This post was last modified on May 17, 2024 10:39 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…