బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది. థియేటర్లకు ఆక్సిజన్ ఇచ్చే స్థాయిలో ఏదైనా ఆడితే బాగుండని కోరుకోని వాళ్ళు లేరు. అందుకే మే 25 రాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ మీద బయ్యర్ల వర్గం గట్టి నమ్మకం పెట్టుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో బలగం తర్వాత ఆయన ఫ్యామిలీ తీసిన మూవీ కావడం అంచనాలు పెంచుతోంది. ఎన్నికల వేడి తగ్గింది. ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంటోంది. ఎండలు కొద్దిగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు లవ్ మీ ట్రైలర్ మీదే ఉన్నాయి. ఇవాళ ఏఏఏ మల్టీప్లెక్స్ లో లాంచ్ ఈవెంట్ జరిగింది.
అనగనగా ఒక ఊరు. రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలు దాటడం ఆలస్యం అలారంలు మ్రోగుతాయి. జనం గుండెలు భయంతో వణికిపోతాయి. ఆ సమయంలో ఎవరూ బయటికి రారు. సరిహద్దుల్లో ఉన్న పాడుబడిన బంగాళాలో దెయ్యం ఉండటమే కారణం. వద్దన్న పని చేయడంలో కిక్ చూసే అర్జున్ (ఆశిష్) దీని గురించి విని అక్కడికి వెళ్తాడు. అనూహ్యంగా అక్కడున్న అమ్మాయి ఆత్మతో పరిచయం పెంచుకుని ప్రేమించడం మొదలుపెడతాడు. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రియురాలు(వైష్ణవి చైతన్య)తో పాటు ఫ్రెండ్స్ చెప్పినా వినడు. ఇంతకీ ఆ రహస్యం ఏమిటో తెలియాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.
లైన్ పరంగా ఎక్కువ డీటెయిల్స్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మహల్లో దెయ్యం పాత కాన్సెప్టే అయినప్పటికీ కామెడీ జోలికి వెళ్లకుండా దాన్ని సీరియస్ గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు అరుణ్ భీమవరపు దీనికి ప్రేమను ముడిపెట్టడం వెరైటీగా ఉంది. క్యాస్టింగ్ పరిమితంగా ఉన్నా థ్రిల్స్ కు సరిపడా హారర్ ని బలంగా దట్టించినట్టు ఉన్నారు. టాప్ టెక్నీషియన్స్ ఛాయాగ్రాహకులు పిసి శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నేపధ్య సంగీతం క్వాలిటీని పెంచాయి. ఆశిష్ అన్నట్టు మూతబడిన థియేటర్లన్లు ఈ లవ్ మీ ప్రేమ దెయ్యం పూర్తిగా తెరిపిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది
This post was last modified on May 16, 2024 8:43 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…