ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఇవాళ రామ్ పుట్టినరోజు సందర్బంగా వదలబోయే టీజర్ మీద అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది. బ్లాక్ బస్టర్ సీక్వెల్ కావడంతో బిజినెస్ పరంగానూ చాలా డిమాండ్ ఉంది. ది వారియర్, స్కంద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రామ్ ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. పూరికి లైగర్ రూపంలో తనకెదురైన సవాల్ కి బదులు చెప్పే బాధ్యత కూడా డబుల్ ఇస్మార్ట్ మీద ఉంది. వీడియో చిన్నదే అయినా మ్యాటర్ గట్టిగానే ఉంది.
దిమాక్ ఖరాబ్ అయితే శంకర్ (రామ్ ) చేసే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో మొదటి భాగంలో చూపించింది శాంపిల్ మాత్రమే అనే రీతిలో డబుల్ ఇస్మార్ట్ లో క్రేజీ కంటెంట్ కనిపిస్తోంది. ఈసారి శక్తివంతమైన కొత్త డాన్ (సంజయ్ దత్ ) తోడవ్వడంతో అరాచకం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది . మెదడులో చిప్ పెట్టే ట్రాక్ ఇందులోనూ ఉంది కానీ దాని ద్వారా జరిగే పరిణామాలను వయోలెన్స్ డోస్ పెంచడం వెరైటీగా ఉంది. టైటిల్ కి తగ్గట్టే రామ్ డబుల్ జోష్ తో తెలంగాణ స్లాంగ్ తో మరోసారి అదరగొట్టాడు. సంజయ్ దత్ లుక్స్, బిల్డప్ కొత్తగా ఉన్నాయి.
విజువల్స్ లో మంచి మాస్ యాక్షన్ దట్టించారు పూరి జగన్నాథ్. హీరోయిన్ కావ్య తాపర్ ఉన్న తక్కువ స్పేస్ లో ఉనికిని చాటుకుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్యామ్ కె నాయుడు – గియాని ఛాయగ్రహణం టెక్నికల్ గా దన్నుగా నిలబడ్డాయి. ఇస్మార్ట్ శంకర్ కొనసాగింపుగా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో దాన్ని అందుకునే ప్రయత్నం పూరి చేసినట్టు క్లారిటీ వచ్చేసింది. విడుదల తేదీ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి హైప్ విషయంలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ డ్యూటీ కరెక్ట్ గానే చేసాడు. దీన్ని నిలబెట్టుకుంటే చాలు ఇంకో హిట్టు ఖాతాలో పడ్డట్టే.
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…