కారణాలు ఏమైనా గ్యాంగ్స్ అఫ్ గోదావరి మే 17 నుంచి వాయిదా వేసుకుని మే 31 వెళ్లిపోవడం మంచి నిర్ణయం కాదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఎన్నికల హడావిడి పూర్తయిన తరుణంలో జనాలు మెల్లగా సినిమాల వైపు తొంగి చూస్తారు. నిన్నటిదాకా ప్రచారాలు, ఓట్ల దందాలు, డబ్బు పంపకాలు, ప్రయాణాలు, టీవీలో వార్తల విశ్లేషణలు, మిత్రులతో చర్చలు ఇలా బోలెడు సమయం ఎలక్షన్ల కోసమే కేటయించి అలిసిపోయారు. ఇప్పుడు అత్యవసరంగా వినోదం కావాలి. సగటు తెలుగు వాడు ముందుగా పెట్టుకునే ఆప్షన్ థియేటర్. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్టు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఉన్నంతలో కృష్ణమ్మ కాస్త డీసెంట్ గా ఉండగా మరీ ఘనంగా చెప్పుకునే వసూళ్లయితే రావడం లేదు. టైమింగ్ చూసుకుని వచ్చిన ప్రతినిధి 2 వీక్ కంటెంట్ వల్ల తేలిపోయింది. అంతకు ముందు వచ్చిన ప్రసన్నవదనంనే రకరకాల ప్రమోషనల్ స్ట్రాటజీలతో నిర్మాత పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అదేమంత గొప్ప ఫలితం ఇవ్వడం లేదు. ఆ ఒక్కటి అడక్కు ఆల్రెడీ సైలెంట్ అయిపోయింది. వీటి కన్నా ఏ సెంటర్స్ లో హాలీవుడ్ మూవీ ది కింగ్ డం అఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మెరుగైన ఆక్యుపెన్సీలు చూపిస్తోంది.
ఒకవేళ గ్యాంగ్స్ అఫ్ గోదావరి కనక ఈ శుక్రవారమే వచ్చి ఉంటే భారీ ఓపెనింగ్స్ దక్కేవని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడో డిసెంబర్ నుంచి అనుకుంటున్న సినిమా ఇప్పుడు మే వచ్చినా కూడా ఇంకా సిద్ధంగా లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా మే 31 పోటీ ఎక్కువగా ఉంది. ముందే ఈ డేట్ ప్రకటించుకున్న హరోం హర, మ్యూజిక్ షాప్ మూర్తి, గం గం గణేశా, సత్యభామ, భజే వాయు వేగం తప్పుకున్నట్టు లేదా వాయిదా పడినట్టు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఒకటి రెండు అవ్వొచ్చు కానీ సోలోగా పండగ చేసుకోవాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఇప్పుడు రెవిన్యూని పంచుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on May 14, 2024 11:35 am
ఏపీ రాజధాని అమరావతికి స్టార్ ఇమేజ్ రానుందా? ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన స్టార్ హోటళ్ల దిగ్గజ సంస్థలు.. అమరావతిలో…
అలేఖ్య చిట్టి పికిల్స్.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి దీని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాజమండ్రికి చెందిన…
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా ఆమె మీడియాతో…
సన్‌రైజర్స్ హైదరాబాద్.. గత ఏడాది ఐపీఎల్‌ను ఒక ఊపు ఊపేసిన జట్టు. అప్పటిదాకా ఈ లీగ్‌లో ఎన్నో బ్యాటింగ్ విధ్వంసాలు…
సమాజంలోని ఏ కుటుంబమైనా.. తమకు ఓ గూడు కావాలని తపిస్తుంది. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పేదలు,.. అత్యంత…
అసలు బాలీవుడ్ లోనే కనిపించడం మానేసిన సీనియర్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హఠాత్తుగా టాలీవుడ్ క్రేజీ అవకాశాలు పట్టేస్తుండటం ఆశ్చర్యం…