ఆ సినిమాను పక్కన పెట్టేసిన కమల్?

కమల్ హాసన్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. 90ల చివర్లో వచ్చిన ఈ చిత్రం సౌత్ ఇండియాలో అప్పటికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ మొదలు కావడం.. కమలే అందులో హీరోగా నటించడం, శంకరే దర్శకుడు కావడం విశేషమే.

ఐతే ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రకటించారో కానీ.. దీనికి ఏదీ కలిసి రావడం లేదు. సినిమా పట్టాలెక్కడంలోనే ఆలస్యం జరిగింది. ఆ తర్వాత షూటింగ్‌కు బ్రేక్ పడుతూ వచ్చింది. గత ఏడాది ‘ఇండియన్-2’ షూటింగ్ స్పాట్లో భారీ క్రేన్ కూడా చిత్ర బృందంలోని ముగ్గురు చనిపోవడంతో ఈ సినిమాకు బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే.

ఈ విషాదం నుంచి కోలుకుని మళ్లీ చిత్రీకరణ మొదలుపెడదాం అనుకునేసరికి కరోనా వచ్చి అడ్డం పడింది. ఆ ప్రమాదానికి సంబంధించి మధ్యలో నిర్మాతలతో హీరో కమల్‌కు విభేదాలు తలెత్తడం, వాటిని పరిష్కరించుకోవడానికి కూడా సమయం పట్టింది.

ఐతే కరోనా భయం తగ్గించుకుని వరుసగా సినిమాల షూటింగ్‌లు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ‘ఇండియన్-2’ను కూడా మళ్లీ పట్టాలెక్కిస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ కమల్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. తన సొంత నిర్మాణ సంస్థలో ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కొత్త చిత్రం అనౌన్స్ చేశాడు.

ఈ సినిమాను ఇంకొన్ని రోజుల్లోనే మొదలుపెట్టేస్తున్నారు. వచ్చే వేసవికి విడుదల అని కూడా ప్రకటించేశారు. శంకర్ సినిమా అంటే భారీతనంతో కూడుకున్నది. కరోనా నేపథ్యంలో సెట్లో 50 మందికి మించి ఉండకూదన్న నిబంధనల్ని ‘ఇండియన్-2’ విషయంలో పాటించడం కష్టం.

అసలే ఇంతకుముందు ప్రమాదం జరిగింది. ఇప్పుడు యూనిట్లో ఎవరైనా కరోనా బారిన పడి ఏమైనా అయితే ఆ పాపం మోయలేమన్న ఉద్దేశంతో పూర్తిగా సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ‘ఇండియన్-2’ షూటింగ్ చేయొద్దని నిర్ణయించారట. ఈ లోపు ఖాళీలో కమల్.. లోకేష్ సినిమాను పూర్తి చేస్తున్నాడు.

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ‘ఇండియన్-2’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాది కూడా ఈ సినిమా విడుదల కాదని స్పష్టమవుతోంది. లోకేష్ సినిమా పూర్తయ్యాక కమల్ కొన్ని నెలల పాటు ఎన్నికల పనిలో బిజీగా ఉంటాడు. ఆ తర్వాత కానీ ‘ఇండియన్-2’ను మొదలు పెట్టే అవకాశం లేదు.

Share
Show comments
Published by
satya

Recent Posts

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

2 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

2 hours ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

8 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

9 hours ago

ఇళయరాజాకు ఇది తగునా?

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…

10 hours ago

నా రెండో సంత‌కం ఆ ఫైలు పైనే: చంద్ర‌బాబు

కూట‌మి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనేన‌ని.. దీనివ‌ల్ల 20 వేల మంది నిరుద్యోగుల‌కు మేలు…

10 hours ago