ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు జూన్ 4 ఫలితాల వెల్లడి, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమం తదితరాలు పూర్తయితే తప్ప ఆయన టాలీవుడ్ ప్రపంచంలోకి రాలేడని అంటున్నారు. అంటే ఇది టిడిపి జనసేన కూటమి అధికారికంలోకి వస్తే జరిగే పరిమాణం. కీడెంచి మేలెంచే కోణంలో ఒకవేళ ప్రతికూల ఫలితం అయితే ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే సెట్స్ కి వచ్చేయొచ్చు.
ముందస్తు సర్వేలు, విశ్లేషణలు టిడిపికే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పవన్ రాజకీయంగా మరికొంత కాలం బిజీగా ఉండటం తప్పని పరిస్థితులు నెలకొనవచ్చు. అదే జరిగితే ఆగస్ట్ కన్నా ముందు పవర్ స్టార్ మేకప్ వేసుకోవడం జరగని పని. ఇదంతా ముందే ఊహించి ఓజి నిర్మాతలు సెప్టెంబర్ 27 డేట్ వదులుకుంటున్నారని, ఆ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ దేవరని దించుతారనే ప్రచారం కాస్త బలంగానే తిరుగుతోంది.
అలా జరిగే పక్షంలో ముందు హరిహర వీరమల్లు పార్ట్ 1 బ్యాలన్స్ ని పూర్తి చేసి దాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయించాలనేది నిర్మాత ఏఎం రత్నం ప్రణాళికలో భాగమని ఇన్ సైడ్ టాక్.
వీటికే ఇలా ఉంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్పనక్కర్లేదు. హరీష్ శంకర్ ఎదురు చూపులు ఇంకొంత కాలం కొనసాగడం ఖాయం. రవితేజతో మిస్టర్ బచ్చన్ పూర్తయ్యాక ఇంకో సినిమా చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చిరంజీవి కూడా ఒక కథ పట్ల సానుకూలంగా స్పందించినట్టు టాక్ ఉంది.
సో పవన్ కళ్యాణ్ నిర్మాతలు దర్శకులు ఇంకొద్ది రోజులు సస్పెన్స్ భరించక తప్పేలా లేదు. ఇవన్నీ పక్కనపెడితే ప్రచారం కోసం ఎండలకు విపరీతంగా తిరిగిన పవన్ తిరిగి ఫిట్ లుక్ లోకి రావడానికే కొంత సమయం పడుతుంది. సో ఈ ఏడాది స్క్రీన్ మీద తనని చూడటం ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంది.
This post was last modified on May 13, 2024 2:37 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…