Movie News

ఓటిటి ఆలస్యం చాలా మేలు చేసింది

మాములుగా ఏ భాష సినిమాలైనా థియేటర్ కు ఓటిటికి మహా అయితే రెండు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండటం చూడం. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్, ఇమేజ్ లేని చిన్న హీరోలు నటించిన బడ్జెట్ మూవీ ఏదైనా సరే అందరూ ఇదే సూత్రం పాటిస్తున్నారు.

ఒకవేళ ఫ్లాప్ అయ్యే సూచనలు ముందే పసిగడితే కేవలం 21 రోజుల విండో పాటిస్తున్న అగ్ర నిర్మాతలు కళ్ళముందే ఉన్నారు. కానీ ఏడాదికి దగ్గరగా ఉన్న టైంలో ఒక చిత్రం డిజిటల్ కు రావడం విచిత్రమే. అదే జర హట్కే జర బచ్కే. విక్కీ కౌశల్, సారాఅలీ ఖాన్ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గత ఏడాది జూన్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది.

టాక్ యావరేజ్ నుంచి ఎబోవ్ యావరేజ్ మధ్యలో వచ్చినా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ ని ఆశ్యర్యపరిచింది. విశ్లేషకులు కంటెంట్ మీద రకరకాల కామెంట్లకు చేశారు. అయినా సరే జనం ఆదరించారు. కట్ చేస్తే థియేటర్లో మిస్ అయినవాళ్లు ఇంట్లో చూద్దామని ఓటిటి కోసం ఎదురు చూస్తుంటే ఎంతకీ రాలేదు.

తొలుత హక్కుల కొనుగోలు విషయంలో ఏదో జరిగిందని, దాని వల్లే ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ చేసుకోలేదని టాక్ వచ్చింది. అలా అదిగో ఇదిగో అంటూ ఫైనల్ గా మే 17 జియో సినిమాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఒకరకంగా ఈ పరిణామం మేలే చేసింది.

ఇంత లేట్ అయ్యిందంటే అంతగా ఏముందనే ఆసక్తి ఆడియన్స్ లో పెరిగిపోయింది. ఆ స్పందన సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఒకవేళ నిన్న సంవత్సరమే త్వరగా వచ్చి ఉంటే దీనికి ఇంత ఓటిటి బజ్ వచ్చేది కాదనే కామెంట్స్ లో నిజం లేకపోలేదు. అలా అని ఇది అందరూ పాటించేది కాదు.

ఎందుకంటే ఓటిటిలకు వ్యూస్ పరంగా ఫీడింగ్ వచ్చేందుకు ప్రధాన కారణమే వీలైనంత త్వరగా డిజిటల్ రిలీజ్ పెట్టుకోవడం. అలాంటిది ఇలా నెలల తర్వాత అంటే రేటు విషయంలో భారీ కోత పెట్టేస్తారు. ఏదో జర హట్కే జర బచ్కే టైం బాగుంది కాబట్టి ఇలా గట్టెక్కిపోయింది.

This post was last modified on May 14, 2024 7:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

4 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

7 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

8 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

9 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

10 hours ago