స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూతుకి వస్తే మాత్రం అందులో సామజిక బాధ్యత ఉంటుంది.
సగటున ఓటింగ్ పర్సెంటెజ్ ప్రతి ఏడాది తగ్గుతున్న తరుణంలో తారలు తమ వంతు కర్తవ్యంగా ఓట్లు వేయడమే కానీ అభిమానులను ఈ యజ్ఞంలో పాలు పంచుకోమని పిలుపు ఇస్తున్నారు. ఇవాళ హైదరాబాద్, ఏపీలోనే పలు కేంద్రాల్లో టాలీవుడ్ స్టార్లు ఇంకా ఎండపొడ తాకక ముందే బూత్స్ కి వెళ్ళిపోయి క్యూలో నిలబడి మరీ తమ హక్కును వినియోగించుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రాఘవేంద్రరావు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, నాగచైతన్య, మంచు మనోజ్ తదితరులంతా తమ హక్కు ఉన్న కేంద్రాలకు వెళ్లి సిరా ఇంకు వేయించుకుని సందేశాన్ని వినిపించారు. మరికొందరు ఎప్పటికప్పుడు ఈ లిస్టులో తోడవుతూనే ఉన్నారు.
కొందరు తెలంగాణ, మరికొందరు ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రతువులో భాగమయ్యారు. అయినా ఉదయం పది గంటలు దాటుతున్నా పోలింగ్ శాతం ఇంకా పెద్ద స్థాయిలో లేకపోవడం తెలంగాణ ట్రెండ్స్ లో కనిపించింది. ఈ విషయంగానే రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక రేపటి నుంచి ఎవరి షూటింగుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎలక్షన్ల వల్లే ఎందరో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కాస్త బ్రేక్ తీసుకుని ప్రచారంలో పాల్గొనడం చూశాం. ముఖ్యంగా జనసేనకు మద్దతుగా పిఠాపురంలో జరిగిన క్యాంపైన్ కు పదుల సంఖ్యలో ఇండస్ట్రీ నుంచి వెళ్లడం తెలిసిందే.
ఫలితాలకు ఇంకో మూడు వారాల సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా పొలిటికల్ డిస్కషన్లు లేనట్టే. అయినా అధికారికంగా సెలవు రోజు ప్రకటించినా ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో ఓట్లు వేసేందుకు రాకపోవడం విచిత్రం. కాకపోతే 2019 కంటే ఈసారి ఎక్కువ నమోదవుతుందని ఒక అంచనా.
This post was last modified on May 13, 2024 11:03 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…