ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పలు పొలిటికల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,వ్యూహం, శపథం లాంటి చిత్రాలు రిలీజైతే.. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ రాజధాని ఫైల్స్, వివేకం, ప్రతినిధి-2 లాంటి చిత్రాలు వచ్చాయి.
ఐతే వీటిలో యూట్యూబ్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చిన వివేకం మంచి స్పందన తెచ్చుకుంది. మిగతా సినిమాలకు ఆశించిన స్పందన రాలేదు. రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా.. మొత్ంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయిన ఈ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం స్ట్రైకింగ్‌గా ఉండి వైసీపీకి సోషల్ మీడియాలో ఇబ్బందికరంగా మారాయి.
ఐతే థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమాను ఇప్పుడు టీవీలో వదులుతున్నారు. సరిగ్గా ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు రాజధాని ఫైల్స్ టీవీ ప్రిమియర్ పడబోతోంది.అది కూడా జగన్ సర్కారుకు ఫుల్ యాంటీ అయిన ఈటీవీలో కావడం విశేషం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ప్రసారం కాబోతోంది. ఎన్నికలు జరగడానికి కొన్ని గంటల ముందు ఇలాంటి సినిమా టీవీల్లో ప్రసారమై జనాలు చూస్తే.. దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది.
ఈ చిత్రంలో అమరావతి రైతుల బాధలను కొన్ని సన్నివేశాల్లో హృద్యంగా చూపించారు. అదే సమయంలో జగన్‌ను పోలిన సీఎం పాత్రను చాలా దుర్మార్గంగా చూపించారు.. గత ఐదేళ్లలో జరిగిన అనేక కీలక పరిణామాలను వైసీపీకి ప్రతికూలంగా చూపించారు ఇందులో. థియేటర్లకు వెళ్లి చూడలేకపోయిన జనం.. ఉచితంగా ఈ సినిమాను టీవీల్లో చూడ్డానికి ఆసక్తి చూపించొచ్చు. కాబట్టి ఇది వైసీపీకి కొంత ఇబ్బందే.
This post was last modified on May 12, 2024 10:38 am
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…
ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా…