Movie News

ప్ర‌భాస్‌ను అడ‌గిందొక‌టి.. అత‌ను తీసుకుందొక‌టి

మంచు విష్ణు హీరోగా ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న క‌న్న‌ప్ప‌లో భారీ కాస్టింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్, అక్ష‌య్ కుమార్, మోహ‌న్ లాల్, న‌య‌న‌తార‌.. ఇలా ముఖ్య పాత్ర‌ల‌కు అదిరిపోయే కాస్టింగ్ సెట్ చేయ‌గ‌లిగాడు విష్ణు. ముఖ్యంగా ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ ఈ చిత్రంలో న‌టించ‌డం బిజినెస్ ప‌రంగా పెద్ద ప్ల‌స్సే. ఇటీవ‌లే ప్ర‌భాస్ ఈ సినిమా సెట్లో కూడా అడుగు పెట్టేశాడు. షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఐతే ఈ చిత్రంలోప్ర‌భాస్ చేస్తున్న పాత్ర ఏంట‌నే విష‌యంలో స‌స్పెన్స్ నెల‌కొంది. ముందు ప్ర‌భాస్ శివుడి పాత్ర చేస్తాడ‌న్నారు. కానీ త‌ర్వాత నందీశ్వ‌రుడి పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి. ఐతే ప్ర‌భాస్ ఇప్పుడు చేస్తున్న‌ది ఏ పాత్ర అన్న‌ది వెల్ల‌డించ‌లేదు కానీ.. తాము ఒక పాత్ర‌ను ఆఫ‌ర్ చేస్తే ప్ర‌భాస్ ఇంకో క్యారెక్ట‌ర్ ఎంచుకున్నట్లు మంచు విష్ణు వెల్ల‌డించాడు.

ప్ర‌భాస్‌కు క‌థ చెప్ప‌డానికి వెళ్లిన‌పుడు ముందు అత‌ణ్ని ఏ పాత్ర‌కు అనుకుంటున్న‌ది చెప్పామ‌ని.. ఐత క‌థ మొత్తం విన్నాక తాము చెప్పిన పాత్ర కాకుండా మ‌రో పాత్ర చేస్తాన‌ని ప్ర‌భాస్ అన్నాడ‌ని.. త‌న‌కు న‌చ్చిన పాత్ర చేస్తే ఇంకా సంతోషం అని చెప్పి ఆ పాత్ర‌నే త‌న‌తో చేయిస్తున్న‌ట్లు విష్ణు వెల్ల‌డించాడు.

ప్ర‌భాస్ ఏ పాత్ర చేస్తున్నాడు.. మిగ‌తా పేరున్న ఆర్టిస్టులు ఏ క్యారెక్ట‌ర్లు చేస్తున్నారు అనే విష‌యంలో సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ‌స్తున్నాయ‌ని.. వాటిని అభిమానులు న‌మ్మ‌వ‌ద్ద‌ని.. త్వ‌ర‌లోనే అప్‌డేట్స్ ద్వారా ఎవ‌రు ఏ పాత్ర చేస్తున్న‌ది అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని విష్ణు తెలిపాడు. అంత‌కంటే ముందు ఈ నెల 13న ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను అభిమానుల‌తో పంచుకోబోతున్నామ‌ని.. అది అంద‌రినీ ఎంతో ఎగ్జైట్ చేసేలా ఉంటుంద‌ని విష్ణు తెలిపాడు.మంచు మోహ‌న్ బాబు నిర్మిస్తున్న ఈ చ‌త్రాన్ని ముకేశ్ కుమార్ సింగ్ రూపొందిస్తున్నాడు.

This post was last modified on May 12, 2024 9:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

56 minutes ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

1 hour ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

2 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

3 hours ago

ఏమిటీ ‘అనుచితాల’.. ఆపండి: బీజేపీపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్ర‌హం!

బీజేపీ మాతృ సంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌).. తాజాగా క‌మ‌ల నాథుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు…

3 hours ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

4 hours ago