నిన్న మనం కృష్ణమ్మ, ప్రతినిధి 2, ఆరంభం అంటూ కొత్త రిలీజుల హడావిడిలో పట్టించుకోలేదు కానీ బాలీవుడ్ నుంచి వచ్చిన శ్రీకాంత్ కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. రాజ్ కుమార్ రావు టైటిల్ రోల్ పోషించిన ఈ ఎమోషనల్ బయోపిక్ తెలుగువాళ్ళు గర్వించాల్సిన చిత్రం. ఎందుకంటే ఇది 1992 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం తాలూకు సీతారామపురంలో పుట్టి కళ్ళు లేకపోయినా గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన ఒక విజేత కథ కాబట్టి. దర్శకుడు తుషార్ హీరానందాని. ఎన్నో బ్లాక్ బస్టర్స్ కి రచయితగా పని చేసి తాప్సి సాండ్ కి ఆంఖ్ ద్వారా డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. స్కామ్ 2003తో మెప్పులు పొందింది కూడా ఈయనే.
ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే తనకిష్టమైన క్రికెటర్ పేరుని కొడుకుగా పెట్టుకున్న తండ్రికి బిడ్డకు చూపే లేకపోవడం శరాఘాతమే. అయినా ఆ పసి మనసు తల్లడిల్లిపోదు. టీచర్ నూరిపోసిన ధైర్యం కూడబలుక్కుని జీవితంలో ఎదుగుతుంది. ఏపీజే అబ్దుల్ కలాంని కలిసినప్పుడు తాను మొదటి అంధ ప్రెసిడెంట్ కావాలనే లక్ష్యాన్ని వెలిబుచ్చడం దాకా వెళ్తుంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి తనలాంటి వాళ్లకు మన దేశంలో అవకాశాలు తక్కువని తెలిసినా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఎలా గెలిచాడనే పాయింట్ మీద శ్రీకాంత్ రూపొందింది. జ్యోతిక ప్రధాన పాత్ర పోషించారు.
టేకింగ్ పరంగా హెచ్చుతగ్గులున్నాయి. బయోపిక్ మెప్పించాలంటే కావాల్సిన డ్రామా తగిన మోతాదులో లేదు. అయినా సరే శ్రీకాంత్ ప్రయాణం స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. రాజ్ కుమార్ పెర్ఫార్మన్స్ కట్టిపడేస్తుంది. అయితే ధోని, మహానటి తరహా నాటకీయత ఇందులో లేకపోవడం వల్ల కామన్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ కాకపోయే ఛాన్స్ లేదు. 2 గంటల 12 నిముషాలు మాత్రమే నిడివి ఉండటం ప్లస్ పాయింట్ గా నిలిచింది. కాస్తంత ఓపికను డిమాండ్ చేసే శ్రీకాంత్ ని బెస్ట్ అనలేకపోయినా మంచి భావోద్వేగాలతో ఒక తెలుగువాడి విజయాన్ని పరిచయం చేసిన మంచి చిత్రంగా మెచ్చుకోవచ్చు.
This post was last modified on May 11, 2024 1:32 pm
నిన్న కేరళలోని కొచ్చిలో ఘనంగా నిర్వహించిన 'పుష్ప 2: ది రూల్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్, రష్మిక…
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత ఇసుక పథకానికి గ్రహణం వీడడం లేదు. ఎన్నోసార్లు ఈ…
అతి తక్కువ గ్యాప్ లో తమ కుటుంబానికి సంబంధించిన రెండు శుభవార్తలు పంచుకున్న నాగార్జున ఇద్దరు కొడుకులు వైవాహిక జీవితాల్లోకి…
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీలు లేని నటుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. అందుకే ఫాన్స్…
అమరావతిలో కొద్ది రోజుల క్రితం జరిగిన డ్రోన్ సమ్మిట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు…
థియేటర్లో కొత్తగా రిలీజైన సినిమాలే పైరసీ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అలాంటిది ఓటిటిలో హెచ్డి ప్రింట్లు వచ్చాక ఆగుతాయా. ఎంత సాంకేతికత…