ఇంకో నాలుగు రోజుల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పుట్టినరోజు రాబోతోంది. మే 15 గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం అభిమానులకో కంటెంట్ కావాలి. దాన్ని డబుల్ ఇస్మార్ట్ బృందం తప్ప ఎవరూ ఇవ్వలేరన్న సంగతి తెలిసిందే.
అయితే అది పోస్టర్ రూపంలోనా లేక టీజర్ వదులుతారానే విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ఇక్కడ కొన్ని చిక్కులున్నాయి. రిలీజ్ డేట్ ఇంకా డిసైడ్ చేయలేదు. జూన్ లో వచ్చే సూచనలు లేనట్టే. భారతీయుడు 2 తప్పుకున్నా దాని ప్లేస్ లో ధనుష్ రాయన్ కర్చీఫ్ వేసుకుంది. అదేమీ పోటీ కాదు కానీ అసలు పూరి జూన్ ఆప్షన్ పెట్టుకోలేదట.
ఎట్టి పరిస్థితుల్లో జూలైకే లాక్ చేసుకోవాలి. కాకపోతే ఇండియన్ 2 కు వారం ముందో లేదా ఓ రెండు వారాలు తర్వాతో ప్లాన్ చేసుకుంటే పక్క రాష్ట్రాల ఓపెనింగ్స్ కి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఆగస్ట్ అనుకుంటే అక్కడ పుష్ప 2 ది రూల్ రూపంలో డైనోసార్ కాచుకుని ఉంటాడు.
పైగా అంత ఆలస్యం చేసినా కష్టమే. అందుకే నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్ తో కలిసి పూరి తీవ్ర సమాలోచనలు చేస్తున్నారట. ప్రస్తుతానికి టీజర్ వీడియో అయితే సిద్ధం చేసి ఉంచారని తెలిసింది. ఒకవేళ విడుదల తేదీ ఓకే అనుకుంటే అందులో పొందుపరుస్తారు లేదంటే కమింగ్ సూన్ ని పెట్టేసి మమ అనిపిస్తారు. అంతే అనుకోకండి.
ఇక్కడ ఇంకో ట్విస్టు ఉంది. ఫైనల్ టీజర్ కట్ పూరి, రామ్ ఇద్దరిలో ఎవరికీ పూర్తి సంతృప్తి కలిగించకపోయినా సరే వచ్చే ఛాన్స్ ఉండదు. కేవలం పోస్టర్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ బలంగా ఉంది. ఫస్ట్ పార్ట్ ని తలదన్నేలా ఊహించని చాలా అంశాలు ఇందులో ఉంటాయని యూనిట్ ఊరిస్తోంది. మణిశర్మ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఆల్బమ్ ఆయన ఇవ్వలేదు. నెలల గ్యాప్ తర్వాత ఇటీవలే రీస్టార్ట్ అయిన డబుల్ ఇస్మార్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.
This post was last modified on May 11, 2024 1:31 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…