‘బిగ్ బాస్’లో గ్లామరో డోస్ పెరిగిందిగా..

వివిధ భాషల్లో ‘బిగ్ బాస్’ షో చూసే వాళ్లలో కుర్రాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వాళ్లను ఎంగేజ్ చేయడానికి హౌస్‌లో గ్లామర్‌కు కొదవ లేకుండా చూస్తుంటారు. ఐతే హిందీతో పోలిస్తే తెలుగులో గ్లామర్ డోస్ తక్కువే. హిందీలో కొన్ని సీజన్లలో అమ్మాయిలు అల్ట్రా హాట్‌గా కనిపించి కుర్రాళ్లను ఆకట్టుకున్నారు. హౌస్‌లో కొందరి మధ్య ఘాటు రొమాన్స్‌ను కూడా చూసి ఎంజాయ్ చేశారు. ఐతే మన ప్రేక్షకుల్లో ఎక్కువమంది మరీ అంత అడ్వాన్స్ కాదు కాబట్టి కంటెస్టంట్లు హద్దులు దాటిపోకుండా చూస్తుంటారు. ఇక తెలుగు బిగ్ బాస్‌లో అర్చన, పునర్నవి లాంటి వాళ్లు కొంచెం కొంత గ్లామరస్‌గా కనిపించారు కానీ.. మరీ హాట్‌గా అయితే ఎవరూ దర్శనమివ్వలేదు. ఐతే ఈసారి మాత్రం షోలో కొత్త దృశ్యాలు కనిపిస్తున్నాయి.

యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయిన దేత్తడి హారిక ‘బిగ్ బాస్’ గ్లామర్ క్వీన్ అవతారం ఎత్తుతోంది. ఈసారి షో ఆరంభం నుంచి ఆమె గ్లామర్ ఒలకబోస్తూనే ఉంది. తాజా ఎపిసోడ్లో అయితే ఆమె కొంచెం రెచ్చిపోయిందనే చెప్పాలి. ‘ఇద్దరమ్మాయిలతో’లోని టాపు లేచిపోద్ది పాటకు మెహబూబ్‌తో కలిసి ఆమె డ్యాన్స్ వేసింది. ఇందులో ఆమె లుక్‌తో పాటు డ్యాన్స్ కుర్రాళ్లకు కిక్కెక్కించాయి. ‘బిగ్ బాస్’లో ఇలాంటి హాట్ డ్యాన్స్ ఇంత వరకు చూడలేదంటే అతిశయోక్తి కాదు. దీని కంటే ముందు కొన్నిసార్లు పొట్టి దుస్తులతో హారిక ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హారికతో పాటు మోనాల్, దివి సైతం చాలా సెక్సీగా కనిపిస్తూ ఈ సీజన్‌కు ఆకర్షణ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి తోడు అరియానా, సుజాత సైతం తమ వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత సీజన్ల పార్టిసిపెంట్లతో పోలిస్తే ఈసారి వచ్చిన వాళ్లకు బయట పాపులారిటీ తక్కువే కానీ.. అమ్మాయిల గ్లామర్ కోణంలో చూస్తే ఈసారి ‘ది బెస్ట్’ అనిపించే కంటెస్టెంట్లు ఉన్నారు.