టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలోనే అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న కల్కి 2898 ఏడి విడుదలకు అట్టే సమయం లేదు. ఇంకో 46 రోజులు గడిస్తే రిలీజ్ డేట్ కళ్ళముందు ఉంటుంది. హైప్ పరంగా బాహుబలి రేంజ్ లో ఉందా అంటే ఔనా కాదాని చెప్పలేని అయోమయంలో ప్రభాస్ అభిమానులున్నారు. ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్లు పూర్తి స్థాయిలో ఆడియన్స్ కి రీచ్ కాకపోవడమే దానికి కారణం. అమితాబ్ బచ్చన్ పరిచయం, ప్రభాస్ కొత్త టీజర్ వగైరాలన్నీ ఆవిష్కరించడానికి ఐపీఎల్ ని ఎంచుకోవడం మంచి ఆలోచనే అయినా అంతగా వర్కౌట్ కాలేదన్నది నిజం.
ఏదైనా గ్రాండ్ ఈవెంట్ లేదా ప్రెస్ మీట్ లాంటివి పెట్టి ఇవి చేయాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఇంకా ఒక్క పాట కూడా లిరికల్ వీడియో రూపంలో రాలేదు. అసలు సాంగ్స్ ఉన్నాయో లేదో చెప్పడం లేదు. ఎప్పుడు రిలీజో క్లారిటీ లేని గేమ్ చేంజర్ నుంచి ఒక పాట వచ్చేయగా అక్టోబర్ లాక్ చేసుకున్న దేవర నుంచి ఫస్ట్ సింగల్ త్వరలోనే రాబోతోందని ప్రకటన ఇచ్చేశారు. కానీ కల్కి నుంచి ఎలాంటి సౌండ్ లేదు. సంతోష్ నారాయణన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటాడోననే ఆసక్తి మూవీ లవర్స్ లో ఉండటం సహజం. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం వీలైనంత త్వరగా జరిగితే బెటర్.
పోస్ట్ ప్రొడక్షన్ ఒత్తిడిలో ఉన్న కల్కి బృందం ముందు పలు సవాళ్లున్నాయి. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, వివిధ బాషల మీడియాలకు ఇంటర్వ్యూలు, ఆర్ఆర్ఆర్ తరహాలో రాష్ట్రాలు తిరుగుతూ క్యాంపైన్ చేయడం వగైరా. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు ఇవేవి చేయకుండానే భీకరమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి కల్కి 2898 ఏడికి అదే సూత్రాన్ని పాటిస్తారా లేక రాజమౌళిని అనుసరించి హంగామా పెంచుతారా అనేది వేచి చూడాలి. టైం పరుగులు పెడుతోంది. ఈసారి వాయిదా ప్రసక్తే లేదంటున్నారు కాబట్టి మెట్రో స్పీడ్ లో పబ్లిసిటీని పరుగులు పెట్టించాల్సిందే. నాగఅశ్విన్ మనసులో ఎలాంటి ప్లాన్ ఉందో.
This post was last modified on May 10, 2024 8:14 am
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…