మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ఒక ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటిదాకా డార్లింగ్ చేస్తోంది ఏ పాత్రనే విషయంలో సరైన క్లారిటీ లేదు. ఒకసారి శివుడిగా మరోసారి నందీశ్వరుడిగా చేస్తాడని రకరకాల ప్రచారాలు జరిగాయి. వీటికి దాదాపుగా చెక్ పడినట్టే. ఎందుకంటే పిక్ లో ఉన్న ప్రభాస్ కాళ్ళ మీద కనిపిస్తున్న దుస్తులు పులి చర్మంతో కప్పబడి ఉన్నాయి. అంటే కాలరుద్రుడి వేషధారణ కాబట్టే ఇలా డిజైన్ చేసి ఉంటారని చెప్పొచ్చు. పూర్తి స్టిల్ వస్తే డౌట్లన్నీ తీరిపోతాయి.
తక్కువ కాల్ షీట్లలోనే ప్రభాస్ భాగాన్ని పూర్తి చేయబోతున్నారని సమాచారం. కన్నప్ప కథ ప్రకారం శివుడు కేవలం క్లైమాక్స్ లోనే వస్తాడు. కృష్ణంరాజు గారి సినిమాలోనూ ఇదే ఉంటుంది. మధ్యలో సన్నివేశాల అవసరానికి తగ్గట్టు కనిపిస్తాడు తప్పించి మొదటి నుంచి చివరి దాకా కన్నప్ప నివసించే గూడెం, అడవిలోనే మొత్తం స్టోరీ జరుగుతుంది. అలాంటప్పుడు ఎక్కువ కాల్ షీట్లు అవసరం లేదు . దానికి అనుగుణంగానే దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ప్లాన్ చేసుకుని పూర్తి చేస్తున్నారట. ఇటీవలే అక్షయ్ కుమార్ భాగాన్ని చాలా వేగంగా తక్కువ టైంలో ఫినిష్ చేసి సాగనంపడం చూశాం.
బాహుభాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న కన్నప్పని ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ దాకా ఈ సంవత్సరం డేట్లు వేర్వేరు భారీ సినిమాలకు లాకయ్యాయి కాబట్టి 2025 తప్పదు. కాకపోతే ఎప్పుడు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు తదితర క్రేజీ క్యాస్టింగ్ తో తీస్తున్న కన్నప్ప ఇప్పటి ఆడియన్స్ ని సరళంగా అర్థమయ్యేలా తీయడానికి విష్ణు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అన్నట్టు నయనతార ఉందనే వార్త వచ్చింది కానీ ఇప్పటికైతే ఎలాంటి నిర్ధారణ రాలేదు.
This post was last modified on May 9, 2024 4:55 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నో పొగిడితేనో..…