Movie News

అప్పన్న సేనాపతి యూనివర్స్ స్నేహం

హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న సినిమాటిక్ యునివర్స్ కాన్సెప్ట్ ని క్రమంగా మన దర్శకులు బాగా పుణికి పుచ్చుకుంటున్నారు. ఖైదీతో మొదలుపెట్టి విక్రమ్ దాకా దర్శకుడు లోకేష్ కనగరాజ్ అందరినీ ముడిపెడతానని గతంలోనే చెప్పాడు. శైలేష్ కొలను తన హిట్ సిరీస్ లో హీరోలందరిని ఒకేసారి కలిపిస్తానని పలు ఇంటర్వ్యూలలో అనడం గుర్తే. ప్రశాంత్ వర్మ హనుమాన్, అధీరలతో స్టార్ట్ చేసి వీలైనంత పెద్ద స్థాయిలో టాలీవుడ్ అవెంజర్స్ ని చూపిస్తానని తెగ ఊరించడం చూస్తున్నాం. వీళ్లంతా కుర్ర డైరెక్టర్లు. ఇప్పుడీ లీగ్ లోకి శంకర్ చేరే అవకాశం ఉన్నట్టు ఆయన టీమ్ నుంచి వచ్చిన స్పెషల్ లీక్.

అదెలాగో చూద్దాం. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ రెండు సినిమాల్లోనూ స్వాతంత్ర పూర్వ నేపథ్యం ఫ్లాష్ బ్యాక్ రూపంలో ఉంటుంది. అప్పన్నగా రామ్ చరణ్, సేనాపతిగా కమల్ హాసన్ పవర్ ఫుల్ గతాలను చూస్తాం. బ్యాక్ డ్రాప్ పరంగా ఒకే కాలం కాబట్టి ఇద్దరినీ ఎక్కడో ఒక చోట ముడిపెట్టి ఒక ఎపిసోడ్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో శంకర్ కొన్ని సీన్లు షూట్ చేశాడని కోలీవుడ్ టాక్. చరణ్ తరచుగా చెన్నై వెళ్ళినప్పుడు ఈ చిత్రీకరణ జరిగి ఉండొచ్చని అంటున్నారు. అదే నిజమైతే మాత్రం తెరమీద పాత గెటప్పుల్లో ఇద్దరినీ ఒకేసారి తెరమీద చూడటం కన్నా కనువిందు ఇంకేముంటుంది.

నిర్ధారణ తెలియలేదు కానీ తమిళ మీడియా వర్గాల్లో ఈ వార్త గట్టిగానే తిరుగుతోంది. భారతీయుడు 2 విడుదల మళ్ళీ వాయిదా పడిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ అక్టోబర్ లో రావడం మీద అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. పోనీ డిసెంబర్ కైనా వస్తుందా అంటే అదీ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాష్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఏదో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ లా విడుదల తేదీల వ్యవహారాన్ని శంకర్ ఎంతకీ తేల్చకపోవడం ఫ్యాన్స్ లో అసహనాన్ని పెంచుతోంది. వీటి వల్ల రామ్ చరణ్ 16 ఇంకా వెయిటింగ్ లోనే ఉంది.

This post was last modified on May 8, 2024 5:15 pm

Share

Recent Posts

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

29 minutes ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

30 minutes ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

2 hours ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

2 hours ago

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

3 hours ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

3 hours ago