కంగనా రనౌత్‌ను ఎవరైనా విమర్శించారంటే అంతే సంగతులు. వాళ్లు జడుసుకునేలా మాట్లాడి నోళ్లు మూయించేస్తుంది. ఆమె ఎంతకైనా తెగించి మాట్లాడుతుంది కాబట్టే.. తన నోటిదురుసుకు భయపడే చాలామంది సైలెంటుగా ఉండిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం కంగనను ఢీకొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్.. కంగనాను కౌంటర్ చేసింది.
బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ మయం అయిందంటూ కంగనా చేసిన వ్యాఖ్యల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఊర్మిళ తప్పుబట్టింది. అంతటితో ఆగకుండా కంగనా సొంత రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్.. డ్రగ్స్ అడ్డాగా మారిందని.. కంగనా ప్రక్షాళన కోరుకుంటే ముందు తన సొంత రాష్ట్రం నుంచే మొదలుపెట్టాలని ఆమె ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
ఐతే కంగనా ఓ టీవీ ఛానెల్ చర్చకు వచ్చిన సందర్భంగా దాని ప్రెజెంటర్ ఊర్మిళ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. ఆమె హద్దులు దాటి మాట్లాడింది. ఊర్మిళ పేరెత్తగానే ఆమె ఒక సాఫ్ట్ పోర్న్ యాక్టర్ అనేసింది. ఊర్మిళ ఎఫ్పుడూ నటిగా గుర్తింపు సంపాదించలేదని, గ్లామర్ క్యారెక్టర్లతో సాఫ్ట్ పోర్న్ యాక్టర్ ఇమేజే తెచ్చుకుందని కంగనా ఎద్దేవా చేసింది.
ఊర్మిళ విసిరిన సవాల్ గురించి మాత్రం మాట్లాడని కంగనా.. రాజకీయాల్లోకి వస్తావా, ఎన్నికల్లో పోటీ చేస్తావా అన్న ప్రశ్న ఎదురైనపుడు మరోసారి ఊర్మిళ ప్రస్తావనే తెచ్చింది. ఊర్మిళ లాంటి నటికే టికెట్ ఇచ్చినపుడు నాకెందుకు ఇవ్వరు అన్నట్లు మాట్లాడింది. ఐతే ఊర్మిళపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పటిదాకా కంగనాకు మద్దతిస్తున్న వాళ్లకు కూడా మండిపోయింది.
ఊర్మిళ ‘రంగీలా’ సహా కొన్ని సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించి ఉండొచ్చు కానీ.. ‘సత్య’ సహా కొన్ని సినిమాల్లో చాలా బాగా నటించింది కూడా. ఆ మాటకొస్తే కంగనా సైతం తనకంటూ ఓ గుర్తింపు రావడానికి బూతు టచ్ ఉన్న సినిమాలే చేసింది. అలాంటపుడు ఊర్మిళను సాఫ్ట్ పో్ర్న్ యాక్టర్ అనడం ఎంత వరకు సబబన్నది బాలీవుడ్ అభిమానుల ప్రశ్న.
This post was last modified on September 17, 2020 12:46 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…