Movie News

దేవర ముందు జాగ్రత్త మంచిదే

జూనియర్ ఎన్టీఆర్ దేవర అధికారిక విడుదల తేదీ అక్టోబర్ 10లో ఎలాంటి మార్పు లేదు కానీ అంతర్గతంగా జరుగుతున్న కొన్ని చర్చలు కీలక పరిణామాలకు దారి తీయొచ్చని సమాచారం. దసరా పండగకు రావడం కన్నా ఒక రెండు వారాలు ముందే ప్లాన్ చేసుకుంటే కనీసం మూడు సుదీర్ఘమైన వీకెండ్లు దక్కుతాయనే ఉద్దేశంతో వేగం పెంచాలనే ఆలోచన దర్శకుడు కొరటాల శివ సీరియస్ గా చేస్తున్నట్టు వినికిడి. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో సెప్టెంబర్ 27 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అయితే అదే డేట్ కి పవన్ కళ్యాణ్ ఓజిని నిర్మాత డివివి దానయ్య ఎప్పుడో అనౌన్స్ చేయడం ఇక్కడ మర్చిపోకూడదు.

కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఓజి చెప్పిన మాటకు కట్టుబడే సూచనలు తగ్గిపోతున్నాయి. టిడిపి జనసేన కూటమి అధికారికంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పవన్ కళ్యాణ్ అంత సులభంగా డేట్లు ఇచ్చే పరిస్థితి రాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఓజి డెడ్ లైన్ అందుకోవడం అసాధ్యం. దర్శకుడు సుజిత్ కి అవసరమైంది కేవలం నెల రోజులే అయినప్పటికీ అదంతా కేవలం ఇన్ డోర్ షూట్ కాదు. ముంబైతో సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒత్తిడితో చేయడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ దెబ్బ తినే ప్రమాదముంది.

ఇది తెలిసే హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ ని ఏఎం రత్నం 2024 ఫిక్స్ అయ్యారని మరో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన దేవర ముందుజాగ్రత్తగా సెప్టెంబర్ చివరి వారంలోనే వచ్చేలా చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. సూర్య కంగువ అక్టోబర్ లో వచ్చే సూచనలు ఉన్నాయి కనక ప్యాన్ ఇండియా కోణంలో రెండు సినిమాలు పరస్పరం దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. ఇంకా ఏదీ నిర్ధారణ కాకపోయినా అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. పైగా నార్త్ లోనూ కాంపిటీషన్ లేకుండా చూసుకోవడం ముఖ్యం కాబట్టి దేవర నిర్ణయం మారడాన్ని కొట్టిపారేయలేం.

This post was last modified on May 8, 2024 6:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

5 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

8 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

9 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

10 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

11 hours ago