హాస్యానికి మారుపేరుగా ఇప్పటి భాషలో చెప్పాలంటే మీమ్ గాడ్ గా చెప్పుకునే బ్రహ్మానందంకు నట వారసత్వం రూపంలో రాజా గౌతమ్ ఉన్నాడు కానీ కుర్రాడికి సరైన హిట్లు లేక కెరీర్ పరంగా దూసుకెళ్లలేకపోయాడు. పైగా తండ్రి లాగా కామెడీ మీదున్న పట్టున్న నటుడు కాకపోవడంతో తన టాలెంట్, రూపానికి తగ్గట్టు హీరోగా నిలదొక్కుకోవాలనే చూశాడు. తొలి సినిమా పల్లకిలో పెళ్లికూతురుకి రాఘవేంద్ర రావు అండగా నిలబడి ఓ మోస్తరు విజయాన్ని అందించినా తరువాత దక్కిన ప్రయోజనం తక్కువే. అలా అప్పుడప్పుడు మాత్రమే కనిపించే గౌతమ్ త్వరలో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు.
నాన్న బ్రహ్మానందం తాత పాత్రలో తాను మనవడిగా నటించబోయే బ్రహ్మ ఆనందం సినిమాలో తమ కాంబోని అఫీషియల్ గా అనౌన్స్ చేయించాడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా ఆర్విఎస్ నిఖిల్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. అనౌన్స్ మెంట్ వీడియోని తండ్రి కొడుకులు ఇద్దరూ వెన్నెల కిషోర్ తో కలిసి వెరైటీగా చేయించారు. తాత పాత్ర చేయమంటే హాస్యబ్రహ్మ వ్యతిరేకించడం, ఒప్పుకున్నాక జరిగే సరదా సంభాషణ ఇలా వినూత్నంగా ప్లాన్ చేశారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హొలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 6 విడుదల తేదీని కూడా అఫీషియల్ గా లాక్ చేసుకున్నారు.
తన పేరు మీద సినిమా తీయడం అందులో బ్రహ్మానందమే నటించడం అరుదనే చెప్పాలి. గతంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అఖిల్ తమ పేర్లే టైటిల్స్ గా పెట్టుకుని సినిమాలు చేశారు. కానీ ఒక కమెడియన్ కి ఇలా జరగడం ఎప్పుడూ లేదు. అందులోనూ ఇంత లేట్ వయసులో గౌతమ్ కి తాతగా నటించే ఛాన్స్ రావడం బ్రహ్మానందానికి కొత్త ఆనందం ఇవ్వడం ఖాయం. చిన్న సినిమానే అయినా ఏకంగా ఎనిమిది నెలల ముందు విడుదల తేదీ చెప్పేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా విపరీతమైన పోటీ ఉన్న ట్రెండ్ లో ఈ మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే.
This post was last modified on May 8, 2024 12:22 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…