Rao Ramesh
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు.
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న టైంలో ఊరిపేరు భైరవకోన సక్సెస్ సందీప్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పైగా ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు తనతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మంచి సబ్జెక్టులు పడుతున్నాయి. ఇప్పుడు చేస్తున్న ఈ కథ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఒకప్పుడు చిరంజీవికి చెప్పి ఒప్పించిందే. కాకపోతే పట్టాలెక్కలేదు.
ఇకపోతే దీనికి సంబంధించిన ఒక లీక్ ఆసక్తికరంగా ఉంది. దాని ప్రకారం సందీప్ కిషన్ తండ్రిగా నటిస్తున్న రావు రమేష్ పాత్ర చాలా హిలేరియస్ గా ఉంటుందట. అంటే వయసొచ్చిన కొడుకు ఉన్నా సరే రొమాంటిక్ టచ్ పెట్టి అతనికో ప్రియురాలని సెట్ చేస్తున్నట్టు తెలిసింది.
ఆమె ఎవరో కాదు ఒకప్పుడు నాగార్జున మన్మథుడు, ప్రభాస్ రాఘవేంద్రలో హీరోయిన్ గా నటించిన అన్షు. ముందు ప్రియమణి, మధుబాల లాంటి ఆప్షన్లు చూశారు కానీ స్టోరీ వినగానే అన్షు సానుకూలంగా స్పందించడంతో అధికారికంగా ఓకే అనుకున్నాక దీని కోసమే ఆవిడను విదేశాల నుంచి తీసుకొస్తారట.
ఎక్కువ మామా అల్లుళ్ళ డ్రామాలతో నవ్వించే త్రినాధరావు నక్కిన ప్రసన్నల జంట ఈసారి రూటు మార్చిందని మాట. సందీప్ కిషన్ జోడి ఇంకా లాక్ కాలేదు. పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ చలాకిగా చేసే అమ్మాయి అవసరం కావడంతో కొత్త టాలెంట్ ని వెతుకుతున్నారని ఇన్ సైడ్ టాక్.
కేవలం హీరోకే కాదు ఇది ఘనవిజయం సాధించడం దర్శకుడు, రచయితకు కూడా అవసరమే. ఎందుకంటే మెగాస్టార్ కే నచ్చిన కథంటే ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ ఆయన చేయాలనుకున్న క్యారెక్టర్ రావు రమేష్ కు దక్కడమంటే మాములు విషయం కాదుగా.
This post was last modified on May 7, 2024 3:36 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…