‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్ ఇదే అంటే అతిశయోక్తి కాదు. మామూలుగా వెబ్ సిరీస్‌లు ఎక్కువగా యూత్ చూస్తుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని అవి పెద్దగా ఆకర్షించలేదు. ఇందుక్కారణం వెబ్ సిరీస్‌లు ఎక్కువగా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కడం, బోల్డ్‌నెస్ ఎక్కువ ఉండటం. ఐతే ‘ఫ్యామిలీ మ్యాన్’ మాత్రం ఇందుకు మినహాయింపు. అది అందరూ చూసి ఎంజాయ్ చేసేలా నీట్‌గా ఉంటుంది. పైగా ఫ్యామిలీ డ్రామా కూడా అందులో హైలైట్. అందుకే ఈ సిరీస్‌కు ఎక్కువ ఆదరణ లభించింది.
ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యాక రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూశారు. వారి నిరీక్షణకు తెరదించుతూ 2021 జూన్‌లో సెకండ్ సీజన్‌ను రిలీజ్ చేసింది అమేజాన్ ప్రైమ్. అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉన్న సెకండ్ సీజన్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అప్పట్నుంచి ఫ్యామిలీ మ్యాన్-3 కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
ఫ్యామిలీ మ్యాన్-3 సెట్స్ మీదికి వెళ్లడంలో చాలా ఆలస్యం జరగడంతో దీని గురించే మరిచిపోయారు అభిమానులు. ఐతే ఎట్టకేలకు మూడో సీజన్ షూట్ మొదలైంది. ఈ విషయాన్ని టీం అధికారికంగా ప్రకటించింది. మూడో సీజన్లోనూ లీడ్ రోల్ చేస్తున్న మనోజ్ బాజ్‌పేయ్ ఆల్రెడీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ సిరీస్ సృష్టికర్తలైన రాజ్-డీకేలే మూడో సీజన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
ఫ్యామిలీ మ్యాన్-3 ఇండియా మీద చైనా ఎటాక్ చేసే బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని రెండో సీజన్ చివర్లోనే హింట్ ఇచ్చారు. ఈ సిరీస్ ఈశాన్య భారత నేపథ్యంలో సాగుతుంది. అక్కడే చిత్రీకరణ కూడా జరుగుతోంది. అమేజాన్ ప్రైమ్ వాళ్లే ఈ సీజన్‌ను కూడా స్ట్రీమ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫ్యామిలీ మ్యాన్-3 ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.
This post was last modified on May 7, 2024 6:15 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…