Movie News

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం అరుదు. అందులోనూ ఓటిటి ట్రెండ్ లో పేరున్న క్యాస్టింగ్ ఉంటేనే ఓపెనింగ్స్ గ్యారెంటీ లేని రోజుల్లో ఇలాంటి సాహసాలు చేసే నిర్మాతలు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం ఇద్దరు విలక్షణ నటులు సోలో హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొదటి వ్యక్తి అజయ్ ఘోష్. ఈ నెల 31 విడుదల కాబోతున్న మ్యూజిక్ షాప్ మూర్తిలో ఈయనదే టైటిల్ రోల్. చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది.

విలన్ గా, సహాయ నటుడిగా ఎన్నో సూపర్ హిట్స్ లో భాగం పంచుకున్న అజయ్ ఘోష్ సోలోగా ఆ మధ్య దోచేవారెవరురా లాంటి ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు కానీ అవి సూపర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ మ్యూజిక్ షాప్ మూర్తి కంటెంట్ పరంగా పాజిటివ్ వైబ్స్ చూపిస్తోంది. జనాన్ని టికెట్లు కొనేలా చేస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం కానీ ఆసక్తి రేపడానికి టీమ్ వెరైటీ ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. ఇక రెండో మనిషి రావు రమేష్. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంకా డేట్ ఖరారు చేయలేదు కానీ టైటిల్ రోల్ ఈయనదే. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు.

గతంలో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలు చేసిన సినిమాలు పెద్ద హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దాసరి గారిని ఉదాహరణగా తీసుకుంటే సూరిగాడు, పోలీస్ వెంకటస్వామి, లంచావతారం లాంటివి భారీ విజయాలు సాధించాయి. రావు రమేష్ తండ్రి రావుగోపాల్ రావు టైటిల్ రోల్ చేసిన మా ఊళ్ళో మహాశివుడుని నిర్మించింది అల్లు అరవింద్. కాకపోతే అప్పటికి ఇప్పటికి బాక్సాఫీస్ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి కాబట్టి ఈ తరం ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభంగా ఉండదు. మరి అజయ్ ఘోష్, రావు రమేష్ లు ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి.

This post was last modified on May 6, 2024 6:00 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

28 minutes ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

31 minutes ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

32 minutes ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

4 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

6 hours ago