Movie News

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ సంవత్సరం కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజయ్యాయి. నెంబర్ పరంగా ఇది సంతోషించాల్సిన విషయమే అయినా వేగం ప్రమాదకరం అన్నట్టు క్రమంగా ఈ స్పీడే బ్రేక్ లా మారుతోంది.

ఇటీవలే విడుదలైన ప్రసన్నవదనం గురించి ఎక్కడా నెగటివ్ టాక్ వినిపించలేదు. మిశ్రమ స్పందన అన్నారు తప్పించి బాలేదనే మాట సోషల్ మీడియాలో వినిపించలేదు. తీరా చూస్తే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని అర్థమైపోతోంది.

దీనికన్నా ముందు వచ్చిన శ్రీరంగనీతులు మరీ అన్యాయం. కనీసం ఇదొకటి వచ్చిందని ప్రేక్షకులు గుర్తించేలోపే మాయమైపోయింది. సోలో హీరో కాకపోయినా సుహాస్ ఫోటోనే హైలైట్ చేసుకుని కాసిన్ని ప్రమోషన్లు చేశారు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సైతం బ్లాక్ బస్టర్ కాదు.

డీసెంట్ గా గట్టెక్కింది తప్పించి నిర్మాతలు చెప్పుకున్నట్టు గొప్ప విజయం సాధించలేదు. ఈ ఫలితాలు సుహాస్ కు చేస్తున్న హెచ్చరిక ఒకటే. వేగం తగ్గించాలి. బడ్జెట్ మీద దృష్టి పెట్టాలి. కొందరు నిర్మాతలు మరీ అన్యాయంగా ఖర్చు పెట్టి ప్రొడక్షన్ క్వాలిటీని దెబ్బేయడం నాణ్యతని తగ్గించినట్టు తెరమీద కనిస్తోంది.

దీని వల్ల డైరెక్టర్లతో పాటు సుహాస్ నష్టపోతున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అన్నట్టు విజయ్ సేతుపతితో పోలిక తెచ్చుకోడం వరకు బాగానే ఉంది కానీ నిజంగా ఆ స్థాయికి చేరుకోవాలంటే సుహాస్ ఇంకా చాలా కష్టపడాలి.

కెరీర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న టైంలో వచ్చిన సినిమాలన్నీ ఒప్పేసుకుంటూ పోతే ఎక్కడో చోట దెబ్బ పడుతుంది. నాని లాగా ఓపెనింగ్స్ గ్యారెంటీ రేంజ్ కు చేరుకోవాలంటే ప్రస్తుత ప్లానింగ్ ఎంత మాత్రం సరిపోదు. కొసమెరుపు ఏంటంటే రాబోయే ఎనిమిది నెలల్లో సుహాస్ సినిమాలు కనీసం నాలుగైదు విడుదల కాబోతున్నాయి.

This post was last modified on May 6, 2024 1:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

3 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

8 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

11 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

12 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

13 hours ago