Movie News

కాస్త లక్కొస్తదని.. ఆమెతో హ్యాట్రిక్ మూవీ

కెరీర్ మొదట్లో ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మామ’, ‘కుమారి 21F’ సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్‌లు కొట్టి, టాలీవుడ్ జనాల దృష్టిలో పడ్డాడు హీరో రాజ్ తరుణ్. అయితే ఎంత త్వరగా యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడో, అంతే త్వరగా వరుస ఫెయిల్యూర్స్‌లో మునిగిపోయాడు రాజ్ తరుణ్.

‘కుమారి 21F’ తర్వాత మనోడి కెరీర్‌లో సరైన హిట్టు లేదు. దాంతో మరోసారి తన లక్కీ హీరోయిన్‌తో జత కట్టబోతున్నాడు హీరో రాజ్ తరుణ్. కెరీర్ స్టార్టింగ్‌లో తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన హీరోయిన్ అవికా గోర్‌తో మరోసారి జతకట్టబోతున్నట్టు సమాచారం.

నిఖిల్ సిద్థార్థ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తర్వాత టాలీవుడ్‌లో మూడేళ్ల బ్రేక్ తీసుకున్న అవికా… హెవీ వర్కవుట్స్ చేసి స్లిమ్ లుక్‌లోకి వచ్చేసింది. ఇంతకుముందులా కాకుండా పూర్తిగా రూట్ మార్చి, చిట్టి పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ లుక్స్‌లో కనిపించేందుకు కూడా సై అంటోంది.

గత ఏడాది ‘రాజుగారి గది 3’లో హీరోయిన్‌గా నటించిన అవికా గోర్‌… రాజ్ తరుణ్‌తో మూడోసారి జతకట్టేందుకు ఓకే చెప్పిందట. ‘సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు’ ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి, రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా ఓ రొమాంటిక్ డ్రామాను రూపొందించబోతున్నారు.

ఈ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ అదిరిపోతుందని, తన కథకు కావాల్సిన మ్యాజిక్‌ను క్రియేట్ చేయడంలో రాజ్ తరుణ్, అవికా జంట సరిగ్గా సూట్ అవుతారని శ్రీనివాస్ పట్టుబట్టి మరీ ఈ ఇద్దరినీ ఒప్పించాడని టాక్. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న రెండో సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన అవికా గోర్… హిందీ సిరీయల్స్‌తోనూ బిజీగా ఉంది. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే రాజ్ తరుణ్, అవికా గోర్‌ల హ్యాట్రిక్ మూవీ ప్రారంభం కానుందని సమాచారం.

This post was last modified on April 29, 2020 8:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సప్తగిరి పక్కన హీరోయిన్ గా ఒప్పుకోలేదా…

ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…

5 hours ago

18న ఢిల్లీకి బాబు… అజెండా ఏంటంటే?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…

5 hours ago

మహిళలకు కూటమి అదిరే గిఫ్ట్!… అగ్రి ప్రోడక్ట్స్ కూ బూస్టే!

ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…

6 hours ago

షాకింగ్‌: ద‌స్త‌గిరి భార్య‌పై దాడి.. చంపుతామ‌ని బెదిరింపు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవ‌ర్‌గా మారిన షేక్ ద‌స్త‌గిరి భార్య షాబానాపై…

7 hours ago

విజయ్ దేవరకొండ అన్నయ్యగా సత్యదేవ్ ?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…

7 hours ago

ఎంపీ డీకే ఇంట్లోకి ఆగంతకుడు… కానీ చోరీ జరగలేదు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…

8 hours ago