ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు అనధికారికంగా సమాచారమిచ్చిన భారతీయుడు 2 కొద్దిరోజులకే నిర్ణయం మార్చుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా ప్రమోషన్ల ఊసే లేదని అభిమానులు టెన్షన్ పడుతున్న సమయంలో ఈ వార్త రావడం గమనార్హం. దర్శకుడు శంకర్ ఊపిరి సలపనంత బిజీలో గేమ్ ఛేంజర్ షూటింగ్ లో ఉన్నారు. ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కి సరిపడా సమయం కేటాయించలేకపోతున్నారు. ఇదో కారణమనుకుంటే అసలైన ఇంకో కోణం ఉంది.
జూన్ 27 విడుదల కాబోతున్న ప్రభాస్ కల్కి 2898 ఏడికి భారతీయుడు 2 మధ్య కేవలం రెండు వారాల గ్యాపే ఉండటం ఎంత మాత్రం క్షేమకరం కాదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారట. ఒకవేళ కమల్ మూవీ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనీసం మూడు నాలుగు వారాల పాటు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు దానికి మద్దతుగా నిలవాలనుకుంటారు. కానీ ప్రభాస్ ఇమేజ్, కల్కి మీదున్న హైప్ దృష్ట్యా తప్పనిసరిగా ఎక్కువ స్క్రీన్లను దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే భారతీయుడు 2 వసూళ్లకు కోలీవుడ్ లోనే కాదు హిందీ, తెలుగు రాష్ట్రాల్లో కూడా దెబ్బ పడటం ఖాయం.
ఇదంతా అలోచించి జూలైకి వెళ్లాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అది కూడా కల్కికి వచ్చే టాక్ ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. బాహుబలి రేంజ్ లో స్పందన ఉంటే చివరి వారం లేదూ కొంచెం అటుఇటు అయ్యిందంటే నెల మధ్యలో రావాలని చూస్తున్నారట. మళ్ళీ జూలైని వదిలేస్తే చాలా డేంజర్. ఎందుకంటే ఆగస్ట్ పుష్ప 2, సెప్టెంబర్ ఓజి, అక్టోబర్ దేవర, డిసెంబర్ హరిహర వీరమల్లు ఇలా పెద్ద లైనప్ ఉంది. ఆరు నూరైనా సరే జూలైలో రావడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దీని గురించి తీవ్ర చర్చలైతే జరుగుతున్నాయి కానీ ఇంకో వారం పది రోజుల్లో కొలిక్కి తెస్తారని చెన్నై రిపోర్ట్.
This post was last modified on May 5, 2024 12:42 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…