పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్ కోరుకోవడం సహజం. తెలుగు, తమిళంలో ఈ ఒరవడి ఎక్కువ. ఐతే బాలీవుడ్‌లో ఇలాంటివి పట్టించుకోరు.
అసలక్కడ అభిమానులు అప్‌డేట్స్ కోసం సోషల్ మీడియాలో గొడవ చేయడం.. చిత్ర బృందాలు క్రమం తప్పకుండా అప్‌డేట్స్ ఇవ్వడం లాంటివి తక్కువ. ఐతే టాలీవుడ్ స్టార్ వెళ్లి బాలీవుడ్‌లో సినిమా చేస్తే.. అప్పుడు ఇక్కడి అభిమానుల ఆకాంక్షలను పట్టించుకుంటారా అన్న సందేహాలుంటాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ విషయంలో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిరాశపరచట్లేదని సమాచారం. తారక్ ప్రస్తుతం తెలుగులో ‘దేవర’తో పాటు హిందీలో ‘వార్-2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మే 20న ఈ నందమూరి హీరో పుట్టిన రోజు కాగా.. ‘దేవర’ టీం నుంచి ఆల్రెడీ ఒక అప్‌డేట్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటుగా ‘వార్-2’ టీం కూడా అభిమానులను మురిపించడానికి సిద్ధమైందట. ఇప్పటికే తారక్ పాల్గొన్న షూట్ నుంచి ఒక మంచి యాక్షన్ టచ్ ఉన్న లుక్ తీసి జూనియర్ పుట్టిన రోజు ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేయబోతున్నారట. ఇది అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అనడంలో సందేహం లేదు. ఇక ‘దేవర’ టీం సినిమా నుంచి తొలి పాటను ఆ రోజే రిలీజ్ చేస్తుందని అంటున్నారు.
ఇంతకుమించి జూనియర్ పుట్టిన రోజుకు వేరే అప్‌డేట్స్ ఉండకపోవచ్చు. ప్రశాంత్ నీల్‌తో తారక్ చేయాల్సిన సినిమా నుంచి గత ఏడాదే ఒక లుక్ రిలీజ్ చేశారు. కానీ ఈ చిత్రం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కే అవకాశం లేకపోవడంతో ఈ ఏడాది మళ్లీ దాన్నుంచి అప్‌డేట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
This post was last modified on May 4, 2024 6:17 pm
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…