Movie News

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు సింగల్ స్క్రీన్ల మద్దతు ఉంటుంది. అయినా సరే చాలా చోట్ల పావు వంతు నిండిన దాఖలాలు తక్కువగా ఉన్నాయి.

మెయిన్ థియేటర్లు పర్వాలేదనిపిస్తుండగా మిగిలిన చోట్ల స్పందన ఊహించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. మొదటి రోజు గ్రాస్ ఒక కోటి అరవై లక్షలకు పైగా వచ్చినట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇది నిజమే అనుకున్నా ఇంకా మెరుగైన నెంబర్లు రావాల్సింది. అల్లరి నరేష్ తనకిది కామెడీ కంబ్యాక్ అవుతుందని బలంగా నమ్మాడు.

ఈ సినిమా గురించి కాసేపు పక్కనపెడితే ఇబ్బంది ఎక్కడ వస్తోందంటే అల్లరోడి స్టామినాకు తగ్గట్టు రచయితలు, దర్శకులు కంటెంట్ రాయలేకపోతున్నారు. మాములు జోకులకు జనం నవ్వరనే లాజిక్ మర్చిపోకూడదు. పైగా జంధ్యాల, ఈవివి కాలం నాటి ఆడియన్స్ ఇప్పుడు లేరు.

ప్రేక్షకుల అభిరుచులు మారాయి. దానికి అనుగుణంగా వాళ్ళను హాస్యంలో ముంచెత్తాలంటే ఏం చేయాలో పెన్నుతో కసరత్తు జరగాలి.

కానీ ఆ ఒక్కటి అడక్కులో అలాంటి జాడలేమి ఉండవు. తేలికపాటి డైలాగులతో ఏదో పబ్లిక్ నవ్విస్తారు లెమ్మని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తరహా రైటింగ్ కనిపించేసింది.

సో సీరియస్ నుంచి కామెడీకి షిఫ్ట్ అవుదామనుకున్న అల్లరి నరేష్ కు తాజా పరిణామం కొంత ఇబ్బంది కలిగించేదే. ఎండల వల్ల కలెక్షన్లు ప్రభావితం చెందుతున్న మాట వాస్తవమే కానీ టాక్ బాగా ఉంటే సాయంత్రం, సెకండ్ షోలైనా మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేసేవి.

దర్శకుడు మల్లి అంకం చేసిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు చేస్తున్న చేయబోయే స్క్రిప్ట్ ల మీద నరేష్ మరోసారి విశ్లేషణ చేసుకోవాలి. లేదంటే ఫలితం రిపీట్ అవుతూనే ఉంటుంది. పాటలు కూడా తన సినిమాలకు మైనసవుతున్నాయి. నెక్స్ట్ రాబోయే బచ్చల మల్లిలో ఇలాంటి లోపాలు లేకుండా చూసుకుంటే చాలు.

This post was last modified on May 4, 2024 4:28 pm

Share

Recent Posts

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఎన్విడియా ఇప్పుడు అనూహ్యమైన వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. సంస్థ మాజీ ముఖ్య…

29 minutes ago

జపాన్ కు ఆంధ్రా అవసరం!

ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్లు, అత్యాధునిక యుద్ధ విమానాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి కొన్ని ప్రత్యేకమైన ఖనిజాలు అవసరం. వీటి ప్రాసెసింగ్‌లో…

37 minutes ago

10 లక్షలకు కొని.. ఇప్పుడు రూ.18 కోట్లకు వదిలేసింది!

ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా మరో జట్టుకు ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిన…

1 hour ago

సీఎం గిఫ్ట్… 61 లక్షల మందికి కేకులు

బాలల దినోత్సవం అంటేనే పిల్లలకు ఎంతో ప్రత్యేకం. ఆరోజు పాఠశాలల్లో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంటుంది. అయితే…

2 hours ago

సరదాగా చెప్పానంటున్న మల్లారెడ్డి కోడలు

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్…

2 hours ago

పొత్తుల్లో భిన్నాభిప్రాయాలు సహజమే

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన…

12 hours ago